హింసకు ప్రోత్సాహం.. ఇదేం రాజకీయం జగన్!?
Publish Date:Jan 10, 2026
Advertisement
జగన్ ది తొలి నుంచీ హింసాత్మక ప్రవృత్తే. ఈ విషయం గతంలోనే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి వెల్లడైంది. తన ఫ్లెక్సీల ముందు పొటేళ్లను అత్యంత హింసాత్మకంగా నరికి.. ఆపై ఆ రక్తాన్ని ఆయన ఫ్లెక్సీలకు పూశారు. ఒక విధంగా చెప్పాలంటే రక్తాభిషేకం చేశారు గతంలో హోం మంత్రిగా పని చేసిన తానేటి వనిత నియోజకవర్గానికి చెందిన గోపాలపురం బ్యాచ్. అయితే వీరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేసింది ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్. వీరు విడుదలయ్యాక నేరుగా ఇళ్లకు వెళ్లారో లేదో తెలీదు. కానీ, సరాసరి జగన్ దగ్గర వాలిపోయారు. వారిని స్వయంగా జగన్ వద్దకు మాజీ హోం మంత్రి తానేటి వనిత తీసుకువెళ్లారు. హోం మంత్రిగా పని చేసిన వనితకు డూస్ ఏంటి? డోంట్స్ ఏంటి? అన్నది క్లియర్ కట్ గా తెలిసి ఉంటుంది. తమకు తెలిసింది ఇతరులకు కూడా చెప్పాలి. కానీ, వనిత ఆ రక్తసిక్త నిందితులను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నేరుగా జగన్ దగ్గరకు తీసుకువచ్చి నిలబెట్టారు. దీంతో వారు కూడా తాము తిన్న పోలీసు లాఠీ దెబ్బలకు అక్కడ ఎకబికిన ఏడ్చేశారు. ఇలా ఎప్పుడూ చేయకండని వారించాల్సిన జగన్.. మీకు నేను అండదండగా ఉన్నానంటూ.. భుజం తట్టి పంపించారు. జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ యువకుడు రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు కట్టి తన ర్యాలీలో పాల్గొన్నపుడే జగన్ వారించాల్సింది. కానీ అలా చేయలేదు సరికదా? రప్పా రప్పా అంటూ గంగమ్మ జతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతామనడంలో తప్పేంటని మీడియానే ఎదురు ప్రశ్నించారు. దీంతో వైసీపీయులు బరితెగించేశారు. ఆయనకేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బయట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది. అవసరమైతే కోటాను కోట్లు కుమ్మరించేయగలరు? అదే ఈ రప్పార్పా నిందితుల పరిస్థితి అలాక్కాదు. వీరిని నేరుగా తీసుకెళ్లి తమదైన స్టైల్ ట్రీట్ మెంట్ ఇచ్చి మరీ వదిలారు పోలీసులు. చాలా మంది వైసీపీ వారు చేస్తున్న రివర్స్ ట్రోలింగ్ ఏంటంటే గతంలో చంద్రబాబు ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన ఫోటోలు, బాలకృష్ణ సినిమా విడుదల సమయంలో పొటేళ్ల తలలు అలంకరించిన వీడియోలను రీ పోస్ట్ చేస్తున్నారు. కానీ, వాటన్నిటిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకున్న సంగతిని మాత్రం ఈ రివర్స్ ట్రోలింగ్ చేస్తున్న వారు బయటకు చెప్పడంలేదు. పైగా అప్పట్లో అలా రక్తాభిషేకం చేసిన వారిని చంద్రబాబు, బాలయ్య సమర్ధించలేదు. అటువంటి చర్యలు తగవని హితవు పలికారే తప్ప వారిని సమర్ధిస్తూ, ప్రోత్సహిస్తూ జగన్ లా ప్రకటనలు గుప్పించలేదు. ప్రస్తుత పరిస్థితికి వస్తే.. రక్త తర్పణం జగన్ కి. బాధలు, కేసులు ఈ నిందితులకు అన్నట్లుగా ఉంది. వీరిని వారించాల్సిన జగన్ వారించకుండా రెచ్చిపోండి నేనున్నాననడమంటే.. అర్ధమేంటి? జగన్ ప్రోత్సాహం, మద్దతు చూసుకుని వీరింకెంత రెచ్చిపోతారో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి హింసాత్మకత గుర్తించిన జనం వచ్చే రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వకుండా పులివెందులలో కూడా జగన్ని ఓడించి మూల కూర్చోబెడితే.. పార్టీకి కాస్తా ఆయన పేకప్ చెప్పేస్తారు. సంపాదించుకున్నదాంతో జగన్ కేం తృప్తిగా బతికేస్తారు. కానీ ఇలాంటి నిందారోపణలతో జీవితాంతం బతకాల్సింది మాత్రం వీరే. కాబట్టి ఇలాంటి వారు ఒక సారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు పోలీసులు.. మరి పోలీసుల మాట విని బుద్ధిగా మసలుకుంటారో.. లేక ఇలాగే రెచ్చి పోయి కేసుల మీద కేసులు నెత్తికి వేసుకుంటారో అది వారి వారి ఇష్టం. మరి మీరేమంటారు?
http://www.teluguone.com/news/content/jagan-encourage-rappa-rappa-batch-39-212312.html





