ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీ పాక్స్ వైరస్ దేశంలో కూడా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైర కేరళలోనే ఈ వైరస్ కారణంగా తొలి మరణం కూడా నమోదైంది. కేరళలోని త్రిసూర్ జిల్లా చావక్కాడ్ కురంజియార్కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ వైరస్ సోకి చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
దేశంలో మంకీ పాక్స్ వైరస్ కారణంగా సంభవించిన తొలి మరణం. మంకీపాక్స్ కారణంగా ఒకరు మరణించినట్లు ధృవీకరించిన కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ మంకీపాక్స్ వైరస్ కారణంగా ఒక వ్యక్తి మరణించిన సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతుడు యూఏఈ నుంచి గత నెల 22న భారత్ కు వచ్చినట్లు పేర్కొన్న ఆమె, అతడికి అక్కడే పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందనీ, అయినా వచ్చిన తరువాత కూడా జాగ్రత్తలు తీసకోకుండా బయట యథేచ్ఛగా తిరిగాడని పేర్కొన్నారు.
సరైన చికిత్స తీసుకోకపోవడం వల్లనే తీవ్రమైన జర్వం వచ్చిందనీ, పరిస్థితి విషమించిన అనంతరం ఆసుపత్రిలో చేరాడనీ, చికిత్స పొంందుతూ మరణించాడనీ మంత్రి వివరించారు. మంకీ పాక్స్ వైరస్ ప్రాణాంతకం కాదనీ, కేరళలో మరణించిన
వ్యక్తి వైరస్ సోకిందని తెలిసిన తరువాత కూడా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి విషమించి మరణించాడని ఆమె వివరించారు. ఆ యువకుడిని కలిసిన వ్యక్తులందరూ ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొన్నారు. మరో వైపు మంకీపాక్స్ వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/monkeypox-virus-spread-in-india-kerala-records-first-death-39-141015.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.