చిన్నప్పటి నుంచి పులి, మేక..సింహం, నక్క..మొసలి, కోతి.. కథలు చదివే వుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు చెబితే వినన్నా వినే ఉంటారు. అయితే అడవి మృగాలన్నీ ఎల్లవేళలా అంతే క్రూరంగా ఉంటాయనీ అనలేం. వాటికి తల్లి, పిల్లల ప్రేమ తెలుసు. వాటిలోనూ తోటి చిన్న ప్రాణులపట్ల లోలోపల ఎక్కడో కాసింత జాలీ ఉంటుంది. అవుననే అంటోంది ఈ జింక పిల్లతోడి సింహం.
అడవిలో సింహం అలా తిరుగుతూండగా హఠాత్తుగా ఈ చిన్నారి జింక పిల్ల ఎదురయింది. అంతే జింక పిల్లకు చచ్చేంత భయం వేసింది. వేగంగా పరిగెత్తలేదు, దాన్నించి తప్పించుకోనూ లేదు. సింహాంగారికి టిఫిన్ అవుతున్నానని తల్లిని ఒక్కసారి తలచుకుని కళ్లు మూసుకుంది. కానీ చిత్రమేమంటే అది భయ పడినంతగా ఏమీ జరగలేదు.
సింహం మాత్రం జింక పిల్ల తల్లి గతంలో తప్పించుకుపోయిందన్న ఆగ్రహం ప్రదర్శించలేదు. దీన్ని తినేసి దాన్ని బాధపెట్టేయాలని సినిమాటిక్గానూ ఆలోచించలేదు. దగ్గరికి వెళ్లి ఆ చిన్నారి భయం పోగొ ట్టింది. జింక పిల్ల మాత్రం తన ఒణుకుని వదిలించుకుని సింహం పంజానే చూస్తూ కూచుండి పోయింది.
కానీ జింక పిల్ల మాత్రం కాసింత భయంతోనే ఒదిగికూచుంది. ఏ క్షణాన ఏ నక్కబావో వచ్చి ఏ అద్బుత ఆలోచనో సింహం చెవిలో పడేస్తే తానేమైపోతానా అని భయపడుతూనే ఉంది. కానీ ఆ సాయిత్రం చీకటి పడేవరకూ కూడా అలాంటిదేమీ జరగలేదు. సాయిత్రం చీకటిపడేవేళ్లకి మాత్రం సింహానికి తన పిల్లలు గుర్తొచ్చినట్టుంది. ఠక్కున లేచి ఒక్కసారి దూరంగా ఎటో చూసింది. అప్పటిదాకా కాళ్లదగ్గరే భయంతో పడున్న జింక పిల్ల మొహాన్ని పెద్దగా ముద్దాడి మళ్ల కలుద్దామని చాలా హుందాగా వెళిపోయింది. సిం హం కనుమరుగైన కొద్దిసేపటికి ఈ చిన్నారి లేచి ధైర్యం కూడగట్టుకుని నిటారుగా నిలబడి నేను సింహాం తో ఇప్పుడే సరదాగా నాలుగు మాటలు మాటాడి వస్తున్నానని తల్లికి చెప్పేంత ధైర్యం ప్రదర్శిస్తూ తాను ఇంటికి వెళ్లింది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/deer-39-141010.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.