మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ మరియు బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని వారి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. నిందితులు ఇప్పటికే సుమారు 20 రోజులుగా జైలులో ఉన్నారని, పోలీసులు ఇచ్చిన రెండు విడతల కస్టడీలో మొత్తం ఆరు రోజుల పాటు విచారణకు పూర్తిగా సహకరించారని వారు వాదించారు. ఇకపై కస్టడీ అవసరం లేదని, బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.
మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్‌కు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు వివరించారు. నిందితుల నుంచి ఇంకా అనేక కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. విచారణకు నిందితులు పూర్తిగా సహకరించలేదని కూడా పేర్కొన్నారు.అదనంగా, రితీష్ మరియు రోహిత్ రెడ్డి బ్యాంక్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/moinabad-farmhouse-drugs-case-36-216786.html
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.