మొయినాబాద్ ఫామ్ కేసులో వాదనలు ముగింపు...తీర్పు రేపటికి వాయిదా!

Publish Date:Apr 6, 2026

Advertisement

 

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ మరియు బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని వారి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. నిందితులు ఇప్పటికే సుమారు 20 రోజులుగా జైలులో ఉన్నారని, పోలీసులు ఇచ్చిన రెండు విడతల కస్టడీలో మొత్తం ఆరు రోజుల పాటు విచారణకు పూర్తిగా సహకరించారని వారు వాదించారు. ఇకపై కస్టడీ అవసరం లేదని, బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.

మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్‌కు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు వివరించారు. నిందితుల నుంచి ఇంకా అనేక కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. విచారణకు నిందితులు పూర్తిగా సహకరించలేదని కూడా పేర్కొన్నారు.అదనంగా, రితీష్ మరియు రోహిత్ రెడ్డి బ్యాంక్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.


 

By
en-us Political News

  
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
2025 రెండవ త్రైమాసికం నాటికి భారతదేశ ఐటీ లోడ్ సామర్థ్యం 1.4 గిగావాట్లుగా ఉంది, మరియు ఈ సంఖ్య రెండేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. నగరంలోని ఫైబర్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, మరియు ఇప్పటికే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ల కారణంగా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో తక్కువ లేటెన్సీ కవరేజీని కోరుకునే ఏ ఆపరేటర్‌కైనా ఇది ఒక సహజ కేంద్రంగా పనిచేస్తుంది.
రాజుపేటకు చెందిన యువతి, ఓ మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ క్సావియర్ బార్ట్లెట్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్‌ను కష్టాల్లో నెట్టాడు.
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.