నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది. ఫ్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసమే ఎగబడుతున్న జనం అనుకుంటున్నారా కాదండోయ్ తమ పిల్లలకు అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాఠశాల గేటు ముందు తెల్లవారుజాము నుంచే క్యూలైన్ కట్టారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతున్నదానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా, పోటీగా మారిన ఈ పాఠశాలపై జిల్లా ప్రజలతో పాటు ఇతర జిల్లాల తల్లిదండ్రుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన స్వంత నిధులతో అభివృద్ధి చేశారు.
ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ విద్యా మందిరంలో స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించ డంతో పాటు విశాలమైన క్రీడా మైదానాన్ని కూడా అందుబాటులో ఉంచారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పాఠశాల ప్రత్యేకతగా మారింది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పాఠశాల పేరు ప్రతిష్ఠలు పెరగడంతో నల్గొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం భారీగా దరఖాస్తులు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ స్కూల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల కోసం పోటీ తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాల నుండి వచ్చిన తల్లిదండ్రులు ఈరోజు సోమవారం తెల్లవారుజామునుండే పాఠశాల గేటు ముందు క్యూలు కట్టారు...ప్రభుత్వ విద్యలో కొత్త దశకు నాంది పలుకుతున్న ఈ పాఠశాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddy-pratik-high-school-36-216796.html
సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచాయి. SBI, HDFC, PNB మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 7.50% నుండి 9.00% వరకు లభిస్తున్న గరిష్ట వడ్డీ రేట్లు, కాలపరిమితి మరియు పన్ను ఆదా వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ నెల 1న ఆయన ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో సమాజ శాంతిని దెబ్బతీసేలా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఏ మాత్రం మంచివి కావన్నారు.
నోయిడాకు చెందిన సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ క్రాటికల్ టెక్ Kratikal Tech BSE SME ప్లాట్‌ఫామ్‌పై గ్రాండ్‌గా లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ట్రేడింగ్ నిబంధనలు, పెట్టుబడి వివరాలు మరియు థ్రెట్‌కాప్ ThreatCop సాస్ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తుపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్ 16లో అమెరికాకు ఘోర పరాజయం. 4 1 గోల్స్ తేడాతో అమెరికాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన బెల్జియం. చార్లెస్ డీ కెటిలేరి అద్భుతమైన డబుల్ గోల్స్ హైలైట్.
నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో టెలికాలర్‌గా పనిచేసిన నిదాఖాన్, యూనిట్ లో మతమార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పరారయ్యారు. దాదాపు 42 రోజుల పాటు అజ్ఝాతంలోకి వెళ్లిన ఆమెను పోలీసులు మేలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఆటపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ సిరీస్ మరియు టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
ప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది.
సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో జతకట్టి, విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా అనుమతులు లభించినట్లు అపాక్ట్ సీఈవో వెల్లడించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.