అన్నీ తెలిసీ మౌనమేల మోడీజీ!

Publish Date:Apr 6, 2023

Advertisement

ఏపీని పంజాబ్ తో పోలుస్తూ పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు, ఏపీలోని అస్తవ్యస్థ పరిస్థితులకు అద్దం పట్టడమే కాకుండా కేంద్రంలోని ఆయన సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని కూడా ఎత్తి చూపేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఔను మరి అప్పులు, అరాచకలతో ఏపీ నానాటికీ దిగజారిపోతోందని మోడీ అన్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల చెప్పారు.

ఏపీలో పరిస్థితులపై   వివరిస్తున్న సందర్భంగా మోడీ కల్పించుకుని తన వద్ద సమాచారం ఉందని అన్నారని కనకమేడల మీడియా సమావేశంలో చెప్పారు. ఆ విషయంలో మోడీ జోక్యాన్ని కోరామని ఆయన అన్నారు. ఏపీ అప్పులు, అస్తవ్యస్థ పరిస్థితులు, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిన తీరు గురించిన సమాచారం మోడీ వద్ద ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

అన్నీ తెలిసినా పట్టనట్ల వ్యవహరించడంలో మోడీ స్థితప్రజ్ణత సాధించారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థల పని తీరు భేషుగ్గా ఉందని మెచ్చుకుంటూనే, ఎటువంటి ఒత్తిడులూ లేకుండా స్వేచ్ఛగా పని చేయాలని సలహా ఇస్తూనే.. విపక్షాలు వినా అధికార బీజేపీ నేతలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఎందుకు చేయడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయన ప్రశ్నించిన పాపాన పోలేదు.  అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించలేదు.  ఇప్పుడు ఆయన ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయనీ, పంజాబ్ ను తలపిస్తున్నాయనీ చేసిన కామెంట్లు ఆయన స్వయంగా మీడియా ముందు చెప్పినవి కావు. ఏపీలో విపక్షానికి చెందిన ఎంపీ ఒకరు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంగా చెప్పిన మాటలు. మోడీ ఆ మాటలు నిజంగా అని ఉండకపోయినా.. మీతో కనుక అన్నాను, ఈ మాటలు మీడియా ముందు వెల్లడించవద్దని ఆ ఎంపీకి సూచించినా ఆయన వాటిని బయటపెట్టే అవకాశం లేదు.

అంటే మోడీ తాను ఏ విషయాన్నీ పట్టించుకోరు.. అన్నీ తెలిసినా చర్యలు తీసుకోరు. ఏదైనా విషయం తన దృష్టికి తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఆ సమాచారం అంతా తన వద్ద ఉందని చెప్పి వారి నోరు మూయిస్తారు.  రాజకీయ లబ్ధి ఉందని భావిస్తే తప్ప ఆయన క్రియాశీలంగా వ్యవహరించరు. ఇప్పటి వరకూ మోడీ తీరుపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలివి. తాజాగా ఏపీ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే విపక్షాల విమర్శలు అక్షర సత్యాలని అనిపించక మానవు. 

  ప్రధానమంత్రి మోదీ పంజాబ్‌తో ఏపీని పోల్చారు. పంజాబ్‌లో   డ్రగ్స్, రౌడీ గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ పెచ్చరిల్లుతోంది. మొత్తంగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు దేశాన్నే దెబ్బతీసేవిగా ఉన్నాయి. అటువంటి పంజాబ్ తో ఏపీలో మోడీ పోల్చారంటే ఏపీలో పరిస్థితులు కూడా దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లేవిగా ఉన్నాయనే అర్ధం. పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నా మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదు.. పట్టించుకోకపోవడం, పట్టించుకోవడం పక్కన పెడితే.. ఏపీలో అధ్వాన పరిస్థితులకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు రెండు చేతులా సహకారం అందిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఆ రాస్ట్రం చేస్తున్న అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఆయన నుంచి సమాధానం రాకపోవచ్చుకు కానీ రాజకీయ పరిశీలకుల నుంచి, సామాన్య మానవుడి వరకూ అందరికీ కారణం ఏమిటన్నది తెలుసు. అది రాజకీయ ప్రయోజనం.  ఏపీలో వైసీపీ మూకలు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై  దాడి చేశాయి.  పక్కా ప్రణాళికతో ఆ దాడి జరిగింది. ఆ దాడిని అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అయినా కూడా దాడి జరిగిన వారిపైనే కేసులు నమోదు చేశారు.  అయినా మోడీ మౌనంగా ఉండిపోయారు. ఇదంతా చూస్తుంటే.. ఆయనకు సమస్యల పరిష్కారం కంటే.. తప్పులను చక్కదిద్దడం కంటే, అవినీతిని, అక్రమాలను అరికట్టడం కంటే రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్న విపక్షాల విమర్శలు వాస్తవమేనని అనిపించక మానదు. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.