కాంగ్రెస్ ను వీడను బాబోయ్ అంటున్నా ఎవరూ నమ్మరేం.. కోమటిరెడ్డి

Publish Date:Apr 6, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుడ్ బై చెబుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. కోమటిరెడ్డి రాజీనామాను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న  వెంకట్ రెడ్డికి పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడంతో పార్టీని విడిచి పెట్టేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరిగింది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని చేర్చుకునే విషయంలో కూడా రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి విభేదించారు. చెరుకు సుధాకర్ ని చేర్చుకున్న సమయంలో  అలిగి.. బీజేపీ అగ్రనేత అమిత్ షా తో   సమావేశమై కలకలం రేపారు.
గతంలో పీసీసీ అధ్యక్ష, ఏఐసీసీ పదవులు ఆశించిన వెంకట్ రెడ్డి,  ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సర్ది చెప్పడంతో సర్దుకుపోయారు. ఆ తర్వాత కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అక్రోశం కోమటిరెడ్డిలో ఉంది. తనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో వెంకట్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎప్పటికప్పుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఎంపీ వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ పార్టీ వీడినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలతో దూరం పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఊరడించడంతో వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని అనుచరులు చెబుతున్నారు.

పార్టీ మార్పు వార్తలు దుమారం రేపడంతో ఎంపీ కోమటిరెడ్డి మీడియా ముఖంగా వాటిని ఖండించారు. ఉద్దేశ్య పూర్వకంగానే కొందరు తనను డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తనది కాంగ్రెస్ రక్తమని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా ఎవరూ ఎందుకు నమ్మడం లేదని ఆకోషం వ్యక్తం చేశారు.  రాజీనామా చేయాలన్న  నిర్ణయం తీసుకో లేదని చెప్పారు. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నాననీ,  భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానని వివరణ ఇచ్చారు.

తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని తనది కాంగ్రెస్ రక్తమని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతలా చెబుతున్నా.. ఆయన పార్టీ మారతారన్న వదంతులు ఆగకుండా రావడానికి ఆయన వ్యవహార శైలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

చిన్న చిన్న సమస్యలపై ప్రధాని మోడీతోనూ, హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావడంపై కోమటిరెడ్డి గతంలో ఇచ్చిన వివరణలు నమ్మశక్యంగా లేవు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసులను చెత్తబుట్టలో పారేశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ముందు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలుస్తాయంటూ చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారన్న వార్తలకు బలం చేకూర్చేవిగా ఉండటమే.. ఆయన తనది కాంగ్రెస్ రక్తం అని చెబుతున్నా.. ఎవరూ నమ్మకపోవడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.