విడదల రజనీ కోసం..!

Publish Date:Mar 3, 2023

Advertisement

చిలకలూరిపేటకు చెందిన వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది కానీ.. మంత్రి పదవి చాన్స్ అయితే లేదని పార్టీ వర్గాల్లోనే అంటున్నారు. ఈ పరిస్థితే ఆయన అనుచరులలో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది.  జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ నాయకుడికి  ఎమ్మెల్సీ మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. అలాంటి వేళ కేబినెట్ కూర్పు అంటే.. తేనెతుట్టెను కదిలించినట్లే అవుతోందని.. ఆ క్రమంలో ఆ ఆలోచన చేయకుండా ఉండడమే మేలనే ఓ భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు ఓ ప్రచారం అయితే ఆ పార్టీలో జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. దీంతో తమ నేత మర్రి రాజశేఖర్‌కు మంత్రి అయ్యే యోగం లేదని వారు పెట్టుకొన్న ఆశలను సైతం వదులుకొంటున్నట్లు తెలుస్తోంది.  

2019 ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా విడదల రజినీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి.. . తన కేబినెట్‌లో మంత్రిగా తీసుకొంటానని.. సదరు నియోజకవర్గ ప్రజలకు  జగన్.. మాట ఇచ్చారని.. అలా ఆ ఎన్నికల్లో రజినీ అయితే గెలిచింది.. ఆమె మంత్రి పదవి సైతం చేపట్టిందని.. అలాగే ఈ నాలుగేళ్లలో  పలుమార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా.. ముఖ్యమంత్రి  జగన్ మాత్రం.. పలువురికి ఎమ్మెల్సీ పదవులు కేటాయించి... శాసనమండలికి పంపారని మర్రి రాజశేఖర్ అనుచర వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. 
 
మరోవైపు ఈ నాలుగేళ్లలో తమ నాయకుడు మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వకుంటే.. ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ.. మరేదైనా పదవి కానీ కట్టబెడతారని ఆయన అనుచరగణం కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసిందని..  కానీ అవేమీ లేకుండా.. ఊరించి.. ఊరించి..  ఎన్నికలు  ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఇలా ఎమ్మెల్సీ పదవి కేటాయించడం పట్ల.. ఆయన కేడర్ ఒకింత నిరాశ నిస్పృహాకు గురైనట్లు ఓ ప్రచారం అయితే జరుగుతోంది. ఇంకోవైపు.. కొద్ది మాసాల ముందే.. కృష్ణా జిల్లా పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పదవిని మర్రి రాజశేఖర్‌కు జగన్ కట్టబెట్టారని వారు పేర్కొంటున్నారు. 

అదీకాక.. వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ దేవుడికే ఎరుక.. ఆ తర్వాత ప్రభుత్వం మారితే.. తమ నేత పరిస్థితి ఏమిటని ఆయన వర్గం ఆందోళనతో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. మర్రి రాజశేఖర్ సామాజిక వర్గం కారణంగానే ఆయనకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే ఓ ప్రచారం సైతం చిలకలూరిపేట నియోజకవర్గంలో జోరందుకొందని తెలుస్తోంది.  

ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ చిలకలూరిపేట నుంచి  వైసీపీ అభ్యర్థిగా విడదల రజినీ బరిలోకి దిగనున్నారని.. ఆమె అభ్యర్థిత్వానికి అసమ్మతి సెగ తలగకుండా... ఆమె గెలుపు నల్లేరు మీద నడకలా సాగడం కోసమే.. మర్రి రాజశేఖర్‌కు ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారనే ప్రచారం సైతం ఆయన వర్గంలో చాలా బలంగా సాగుతోంది.  

వచ్చే ఎన్నికల ప్రచారం వేళ.. ముఖ్యమంత్రి, ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్.. మళ్లీ ఈ నియోజకవర్గానికి వచ్చి.. మర్రి రాజశేఖర్‌ను ఇప్పటికే ఎమ్మెల్సీ చేశామని.. మళ్లీ అదికారంలోకి వస్తే.. ఆయనకు మంత్రి పదవి కేటాయిస్తానని.. అది కూడా కీలక శాఖ కట్టబెడతానంటూ హామీ ఇచ్చే అవకాశం ఉందని మర్రి రాజశేఖర్ వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఓ వేళ వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్ జగన్ పార్టీ విజయం సాధించినా.... గతంలో లాగే తమ నేత మర్రి రాజశేఖర్‌ను మరిచిపోతే.. పరిస్థితి ఏమిటని ఆయన వర్గం సూటిగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ నేత రాజశేఖర్ సూచనలకు అనుగుణంగా నచుకొంటామని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. మరి మర్రి రాజశేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది  వేచి చూడాల్సిందే.    

మరోవైపు గతంలో మాజీ మఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సంతాప సభను నియోజకవర్గంలో నిర్వహించిన సమయంలో మర్రి రాజశేఖర్ బావమరిది మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో మర్రి రాజశేఖర్‌కు గుర్తింపు లేకుండా పోయిందని ఆరోపించారు. మరో పార్టీలో మర్రి రాజశేఖర్ ఉంటే.. ఆయన పరిస్థితి మరోలా  ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారని ఆయన వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోండడం గమనార్హం.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.