విజయసాయి రెడ్డి రాజకీయ వ్యూహం: మతంతో గేమ్సా?

Publish Date:Oct 8, 2026

Advertisement

వైఎస్ కుటుంబంతో దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన విజయసాయిరెడ్డి, 2024లో వైసీపీ  అధికారం కోల్పోయిన తర్వాత జగన్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించే పనిలో  ఉన్నారు.ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి అనుసరిస్తున్న వ్యాహాలు, చేస్తున్న కుల, మత ప్రస్తావనలు సంచలనంగా మారాయి. ఆయన తీరు పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది.విజయసాయి ప్రతి అంశంలోనూ కుల, మత కోణాలను వెలికి తీస్తూ సంచలన రాజకీయమే తన బాణి, వాణి, బాట అని చాటుతున్నారు. 

తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముస్లింలు, క్రైస్తవులు హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు అక్కడి ప్రసాదాన్ని గానీ, పవిత్ర వస్త్రాలను గానీ స్వీకరించరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే  సమయంలో హిందువులు చర్చిలు లేదా మసీదులకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడి నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు. 

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దళితులను ఆలయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే అగ్రవర్ణాల వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తానని  ప్రకటించారు. సాధారణంగా లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులపరమైన విభజనలు ఉన్నప్పటికీ, కొన్నేళ్ల క్రితం వరకు మతపరమైన అసమ్మతి లేదా విభేదాల ఛాయలు  ఇసుమంతైనా కనిపించేవి కావు. అయితే ఇప్పుడు విజయసాయి రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఆందోళన కలిగిస్తున్నది.

ఇటీవల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో.. ఆంధ్రప్రదేశ్‌ను కేవలం రెండు కుటుంబాలు, రెండు వర్గాలు మాత్రమే పాలించాలా? అనే ప్రశ్నను లేవనెత్తారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రి కావాలా? కాపులు, వెలమలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు ఉండకూడదని  ప్రశ్నించారు. కొత్త పార్టీ ప్రకటనకు విజయసాయి సన్నద్ధమౌతున్న వేళ విజయసాయి చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అయితే..  పార్టీ నిర్మాణం, విధివిధానాలు, ప్రధాన రాజకీయ లక్ష్యాలు పూర్తిగా వెల్లడించిన తరువాత మాత్రమే విజయసాయి  వ్యాఖ్యల రాజకీయ ప్రభావాన్ని ఏ మేరకు ఉంటుందన్నది తెలుస్తుంది. 

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు  ఎప్పుడూ కీలక అంశమే.   రెడ్డి, కమ్మ, కాపు తదితర సామాజిక వర్గాల రాజకీయ ప్రాతినిధ్యంపై   చర్చ జరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల సందర్భంలోనూ రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాల ప్రభావంపై విశ్లేషణలు వెలువడ్డాయి.

ఇప్పుడు విజయసాయిరెడ్డి అదే అంశాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చారు. అయితే కులం, మతం ప్రస్తావించడం మాత్రమే ఒక కొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది అవుతుందా?  అంటే పరిశీలకులు ఆ అవకాశం లేదని కుండబద్దలు కొడుతున్నారు.  ఏది ఏమైనా విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలు మత ప్రస్తావన, ఏపీ రాజకీయాలలో కొత్త చర్చకు తెరతీశాయని చెప్పవచ్చు.  అయితే ఈ రాజకీయ వ్యూహం ఆయన కొత్త పార్టీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందన్నది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. 

[Vijayasai Reddy Political Strategies, Sai Reddys New Party, Jagan, YCP, TDP, Caste politics, Religious politics, Reddy Vote Bank, AP Politics, Telugu One]

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.