దువ్వాడ ఆరోపణలపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
Publish Date:Dec 27, 2025
Advertisement
వైసీపీ బహిష్కృత నేత , ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తప్పుబట్టారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడం లేదని స్ఫష్టం చేశారు. తన గురించి దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తనకు దువ్వాడతో ఎటువంటి విభేధాలు లేవన్నారు. దువ్వాడ నిరాధారమైన ఆరోపణలు చేస్తుండంతో తన అనుచరులు స్పందిస్తున్నారని కృష్ణదాస్ తెలిపారు కింజారపు అప్పన్నతో తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తనకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఎటువంటి విబేధాలు లేని ధర్మాన క్లారీటీ ఇచ్చారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతు హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు. అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వద్ద హైవేపై కారు ఆపి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తాను భయపడే వ్యక్తి కాదన్నారు. అయితే ఈ ఆరోపణలను కృష్ణదాస్ ఖండించారు. ఈ క్రమంలో మాధురి, కింజరాపు అప్పన్నల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఆడియోలోని మాటలు వాస్తవమేనని కృష్ణదాస్ చెప్పడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
http://www.teluguone.com/news/content/mlc-duvvada-srinivas-36-211636.html





