జగన్ కంఠశోష.. వైసీపీ నేతలకు శిరోభారం!

Publish Date:Sep 27, 2023

Advertisement

జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఏ సందర్భంలో ప్రసంగించినా ఆయన స్టైల్ ఒక్కటే.. ఆయనకు తెలిసిందీ ఒక్కటే.. అదే ఆత్మస్థుతి, పరనింద. తన భుజాలను తానే చరుచుకోవడం, ప్రత్యర్థులపై విరుచుకుపడటం. మరో సారి కూడా జగన్ మోహన్ రెడ్డి అదే చేశారు. ఆయనకు తీరిక దొరికినా, ఏమీ తోచకపోయినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజవకర్గ ఇన్ చార్జీలతో సమావేశమౌతారు. అలాగే మంగళవారం (సెప్టెంబర్ 26) కూడా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ చార్జీలతో భేటీ అయ్యారు.

గత భేటీలకూ, ఈ భేటీలకూ పెద్ద తేడా ఏమీ లేదు. గత భేటీలలో ఏం చేప్పారో.. ఈ సారి అదే చెప్పారు. అయితే  రాష్ట్రంలో తన పాలనపై తీవ్రంగా వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగా ఆయన మాటల్లో ధీమా తగ్గింది. స్వరంలో వాడి లేదు. పని తీరు మార్చుకోవాలన్న హెచ్చరికలు లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరంతా నా వాళ్లు. మిమ్మల్ని నేను వదులు కోను అంటూ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు, ఎమ్మెల్సీల నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేశారు. అయితే గత సమావేశాలలో జగన్ టోన్ ఇలా లేదు. హెచ్చరికలు, పనితీరు మార్చుకోకుంటే టికెట్ ఇవ్వనంటూ ఆగ్రహం కనిపించాయి. అయితే ఈ సారి టోన్ పూర్తిగా మారిపోయింది. సిట్టింగులందరికీ టికెట్లిచ్చే పరిస్థితి లేదు అని చెబుతూనే టికెట్ దక్కని వారు కూడా తనవారేననీ, వారికి తప్పని సరిగా ఏదో ఒక పదవి ఇస్తానంటూ బుజ్జగింపు ప్రయత్నాలే జరిగాయి. 

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆ వ్యతిరేకత పీక్స్ కు చేరింది. అంతే కాకుండా వైసీపీ నేతలు, శ్రేణులలో కూడా జగన్ తప్పు చేశారని, చంద్రబాబుది అక్రమ అరెస్టుననీ, దీని వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిందన్న అభిప్రాయమే వ్యక్తం అవుతున్నది. అంతర్గత సంభాషణల్లో పార్టీ నేతలు, శ్రేణులూ ఈ విషయంపై చర్చించుకుంటున్నారు కూడా. ఈ విషయాలన్నీ గ్రహించే జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. నష్ట నివారణ చర్యలలో భాగంగా చాలా సౌమ్యమైన స్వరంతో ప్రసంగించారు. జనంలో వచ్చిన వ్యతిరేకతను ఎటూ తగ్గించలేం. కనీసం పార్టీ నేతలు, శ్రేణుల్లో  ఉన్న భయాలు, ఆందోళనను అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో జగన్ ఈ భేటీ ఏర్పాటు చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే సముదాయించడం, భయాలను, ఆందోళనలను తొలగించడం మాట అటుంచి జగన్ వారికి చెప్పింది ఆవు కథ మాత్రమే.

గతంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాలలో చెప్పిన విషయాన్నే అక్షరం పొల్లుపోకుండా జగన్ మళ్లీ వల్లె వేశారు. ఇక్కడ కొత్తగా ఆయన చేసిన ప్రతిపాదన ఏమిటంటే జగనన్న సురక్ష,  వై జగన్ నీడ్ ఏపీ కార్యక్రమాలు నిర్వహించాలన్నది మాత్రమే. ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాగ్రహాన్ని ఓ రేంజ్ లో ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు, నాయకులు మరోసారి పేరేదైనా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్లేందకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తరువాత పలువురు ఇదే అభిప్రాయాన్ని ఒకింత బాధతో, ఒకింత నిర్లిప్తతతో ఒకరికొకరు చెప్పుకున్నారు.  

బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడమే పాలన అనుకునే నాయకుడికి జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్న నాయకుల బాధలు ఎలా తెలుస్తాయని అంటున్నారు. రోడుకు ఇరువైపులా పరదాలు కట్టుకుని జనాగ్రహం కంట పడకుండా నేరుగా వేదికపైకి వచ్చి బటన్ నొక్కేసి డబ్బులు పంచేశానని ప్రకటించి.. జనం వింటున్నారా, సభ నుంచి పారిపోతున్నారా అన్నది పట్టించుకోకుండా ప్రసంగించేసి వెళ్లిపోయే జగన్ కు పార్టీ నేతల ఇబ్బందులు ఎలా తెలుస్తాయని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తం మీద జగన్ తో భేటీలో మరోసారి ఆవుకథ విన్నామంతే.. అంతకు మించి జరిగిందేమీ లేదని పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.