మంత్రి పదవి రాకున్నా ఓకే.. జిల్లా మార్చాల్సిందే.. జగనన్నతో రోజా జగడం!

Publish Date:Apr 5, 2022

Advertisement

ఉగాది పర్వదినం పురస్కరించుకుని.. జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఫ్యాన్ పార్టీలోని ఎమ్మెల్యేలకు కొత్త నొప్పులు మొదలైనాయట. అయితే.. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై తామే పెదవి విప్పితే.. తమ ప్రభుత్వం పరువు తాడేపల్లి ప్యాలెస్‌కూ కూత వేటు దూరంలో ఉన్న కృష్ణానదిలో పడి కొట్టుకు పొతుందని జగన్ పార్టీ ఎమ్మెల్యేలంతా నోటి మీద వేలేసుకుని మరీ అమ్మఓడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థిలాగా సైలెంట్‌గా కూర్చున్నారట. 

అయితే ఇదే అంశంపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం లోలోన తెగ రగిలిపోతోందట. తన నియోజకవర్గం నగరిని.. కొత్తగా ఏర్పాటైన తిరుపతి జిల్లా పరిధిలోకి తీసుకు వెళ్లాలని ఆమె శతధా ప్రయత్నించిందని.. ఆ క్రమంలో ఈ పంచాయతీని ఆమె ... సీఎం జగన్ వద్దకి ఒకటి రెండు స్లారు కాదు.. ముచ్చటగా మూడు సార్లు స్వయంగా తీసుకు వెళ్లిందట. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. తనదైన శైలిలో.. ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని సమాచారం. దీంతో ఆర్కే రోజా లోలోపల కుతకుతలాడిపోతున్నారని తెలుస్తోంది.  

చిత్తూరు జిల్లా రెండుగా అయింది. ఒకటి చిత్తూరు జిల్లాలనే కాగా.. మరొకటి తిరుపతి జిల్లాగా ఏర్పాటు అయింది. అయితే చిత్తూరు జిల్లాలో రోజా నియోజకవర్గం నగరితోపాటు జి. నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.. రోజాకి రాజకీయ వైరం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయం సీఎం జగన్‌కి కూడా తెలుసన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అదీకాక.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా చాలా సీనియర్.. చంద్రబాబు సొంత ఇలాకా కుప్పంలో.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ జెండా రెపరెపలాడిందంటే.. అదంతా.. పెద్దిరెడ్డి వారి చలవేనన్న విషయం కూడా తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. జగన్ రాజకీయ ప్రత్యర్థి.. చంద్రబాబు రాజకీయా భవితవ్యానికి పెద్దిరెడ్డి వారితో చెక్ పెట్టించాలనే కృత నిశ్చయంతో సీఎం జగన్ ఉన్నారు. అందుకే ఆ విషయంలో పెద్దిరెడ్డి వారి మాట.. జగనన్నకి చద్దన్నం మూట అన్న సంగతి ఆ పార్టీలోని కీలక నేతలకే కాదు.. ఆర్కే రోజాకు కూడా బాగా తెలుసు. 

అందుకే.. తన జిల్లాలో పెద్దిరెడ్డి వారు ఉంటే.. తనకు రాజకీయంగా దెబ్బ అని విషయం రోజాకి బాగా అర్థమైందీ. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గాన్ని తిరుపతికి తరలించుకుపోవాలని.. సీఎం జగన్‌ను కలిసి ఎన్ని సార్లు విన్నవించుకున్నా.... ఫలితం లేకపోవడంతో.. ఆర్కే రోజా ఆందోళన రోజుకు రోజుకు తీవ్రమవుతోందట. ఇదే అంశంపై మళ్లీ జగన్‌ను కలిసి.. విన్నవించుకునేందుకు.. ఈ ఆర్కే రోజా వారు.. రోజూ తాడేపల్లి ఫ్యాలెస్ చుట్టు ప్రదక్షణాలు చేస్తున్నారనే చర్చ కూడా సదరు ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. 

కొత్త కేబినెట్‌లో మంత్రి వచ్చినా.. రాకపోయినా... ఫర్వలేదు కానీ.. తన నియోజకవర్గాన్ని మాత్రం శ్రీవారి జిల్లాలో కలపాలంటూ తన సన్నిహితుల వద్ద రోజా తన మనస్సులోని మాటకు బయటపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రోజా.. పలు దేవాలయాలను వరుసగా కీ ఇచ్చిన బొంగరంలా చుట్టేస్తోంది. జగన్ కేబినెట్‌లో చోటు కోసమే ఆమె ఈ దేవాలయాల ప్రదక్షణ అంటూ అటు మీడియాలోనే కాదు..ఇటు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. కానీ రోజా దేవాలయాల ప్రదక్షణ వెనక ఇంత కథ ఉందా ? అని నగరిలోని ఆ పార్టీ నేతలే ముక్కన వేలేసుకుంటున్నారట. 

ఇప్పటికే నగరి నియోజకవర్గంలోని అయిదు మండలాల్లోని రోజా వ్యతిరేకవర్గాన్ని ఒకే తాటిపైకీ తీసుకురావడంలో.. పెద్దిరెడ్డి వారు వేసిన పాచికా .. పారింది. దీంతో ఆర్కే రోజా ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారో అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆర్కే రోజా.. మనస్సులోని కోరికను సీఎం జగన్ తీరుస్తారా? అంటూ పెద్దిరెడ్డి వర్గం వారు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఆర్కే రోజాను సీఎం జగన్ బాగా ఫిక్ చేశారంటూ ఆదే వర్గం వారు లోలోన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రోజా కోరికను సీఎం జగన్ తీరుస్తాడా? అంటే ఏమో చూడాలని ఆమె వర్గం వారు వెయ్యి కళ్లతో తిరుపతి జిల్లాలోని శ్రీవారిపైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.