Publish Date:Mar 29, 2020
లాక్‌డౌన్ సందర్భంగా పేద ప్రజల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఐదుకిలోలు బియ్యం, ప్రతి కార్డుకు కేజి కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తోంది. 58 లక్షలమంది పెన్షన్ దారులకు 1 వతేదీన పెన్సన్ ఇవ్వనున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏ, ఏపి ఐఐసి ఛైర్మన్ ఆర్ కే రోజా తెలిపారు.
కరోనా మహమ్మారి వల్ల ప్రజలు రోజూ బయటకు వెళ్లి పనిచేసుకోలేక సంపాదన లేక కూర్చుని ఉండమంటే వారి కుటుంబపోషణకు కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ ఉచితంగా ఇస్తున్నారని ఆమె చెప్పారు.
ఈ రోజు మొదటి విడత, ఏప్రిల్ 15న రెండో విడత, ఏప్రిల్ 29 వతేదీన మూడోవిడతగా రేషన్ ఇస్తారని ఆమె తెలిపారు. 1 కోటి 40 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్ నాలుగో తేదీన వేయి రూపాయలు ఇవ్వాలని సి.ఎం. ఆదేశాలు ఇచ్చారని ఆమె చెప్పారు.
రాత్రింబవళ్లు పనిచేస్తున్న పోలీసులకు మనమందరం అండగా ఉండాలి. ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగిన సంఘటనలు వీడియోలు పోస్టు చేసి పోలీసుల పరువు తీసి 24 గంటలు మన కోసం పనిచేసే పోలీసులను అవమానించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. కరోనా ను పారదోలడంలో ఐకమత్యంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. లాక్ డౌన్ పాటిస్తూ బయటకు వెళ్లివచ్చే సందర్భంలో పరిశుభ్రత పాటిస్తూ కాళ్లు, చేతులు కడుగుకుని దుస్తులను సైతం హాట్ వాటర్ లో పెట్టాలని ఆమె సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-roja-lauds-cm-jagan-for-free-ration-distribution-25-96483.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.