మర్మా*గాలు కోసి, కాళ్లు చేతులు నరికేసి.. కాల్చిపారేయాలన్న నల్లపురెడ్డి..
Publish Date:Oct 12, 2021
Advertisement
ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని యావత్ రాష్ట్రం ఆందోళన చెందుతోంది. వరుస ఘటనలు పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. పాలకుల చేతగానితనాన్ని ప్రశ్నిస్తున్నాయి. గడిచిన రెండున్నరేళ్లలో మహిళలు, చిన్నారులపై వందలాది అత్యాచార, హత్యలు జరిగాయంటూ ప్రతిపక్షం లెక్కలతో సహా ప్రభుత్వాన్ని నిప్పులతో కడిగేస్తోంది. బాధితులను పరామర్శించడానికి నారా లోకేశ్ వెళితే.. కేసులు, అరెస్టులతో కక్ష్య సాధింపు చర్యలైతే చేపడుతున్నారు కానీ, మరో ఘటన జరగకుండా మాత్రం ఆపలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దిశ చట్టం, దిశ యాప్‌తో ఫలితం శూన్యం అని అంతా పెదవి విరుస్తున్నారు. కనీసం దిశ చట్టానికి కేంద్రం నుంచి ఆమోదముద్ర వేయించుకోలేని వైసీపీ సర్కారును అంతా దుయ్యపడుతున్నారు. ఓవైపు ఏపీలో, జగన్ పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతుంటే.. మరోవైపు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అప్పుడే మృగాళ్లలో భయం ఏర్పడుతుందని చెప్పారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయని.. రోడ్లపై తిరగాలంటేనే మహిళలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై దౌర్జన్యం చేసే మానవ మృగాలను పక్క దేశాల్లో నడిరోడ్డపై ఉరితీస్తారని, భారత్‌లో అలాంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు నల్లపురెడ్డి. మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని ఆయన అన్నారు. చట్టాలలో మార్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. మానభంగం చేసిన వారిని పట్టుకుని శిక్షిస్తే సరిపోదని.. నడిరోడ్డుపై మర్మా*గాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే.. వారిలో భయం వస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. దిశ పేరుతో కాలయాపన చేస్తున్న జగనన్నకు ఈ విషయం చెప్పాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం దిశ చట్టంతో ఒక్క దోషికైనా సత్వర శిక్ష పడేలా చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. దిశ చట్టాన్నే అమలు చేయలేని మీరు.. ఇలా మైకుల ముందు.. కాల్చిపారేయాలి.. మర్మా*గాలు కోసేయాలి.. కాళ్లు చేతులు నరికేయాలని.. స్పీచులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమంటూ మండిపడుతున్నారు మహిళలు.
http://www.teluguone.com/news/content/mla-nallapureddy-hot-comments-on-women-safety-39-124466.html





