జగన్ కార్యకర్తల చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు
Publish Date:Dec 30, 2025
Advertisement
రప్పారప్పా అన్న వారిని రఫ్పాడిస్తున్న పోలీసులు వైసీపీ కార్యకర్తల మెడకు రప్పారప్పా కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇష్టారీతిగా రప్పరప్పా అంటూ దౌర్జన్యాలకు పాల్పడతామంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా, రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలకు మూగజావాలను బలి ఇచ్చి రక్తాభిషేకాలు రెచ్చిపోయిన కార్యకర్తలు, జగన్ అభిమానులు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జగన్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్లను బలిచ్చి ఆయన ఫోటోలకు ఆ రక్తాన్ని తర్పణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మక కామెంట్లను ఫ్లెక్సీలపై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు. ఇప్పుడు ఆ విషయంలోనే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఔను ఎక్కడెక్కడ ఎక్కడ రప్పా రప్పా అంటూ ఈ జంతు బలులు ఇచ్చారో అక్కడక్కడ అలా రక్తతర్పఫాలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యర్తలపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే జగన్ కారణంగా జైళ్లకు పోయి వచ్చిన లీడర్ల సంఖ్య విపరీతంగా ఉంటే ఇప్పుడది కార్యకర్తల వరకూ పాకింది. అంటే జగన్ ప్రాపకం కోసం కార్యకర్తలు చేసిన అతి వారిని కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. అయినా రప్పారప్పా పోస్టర్లను, జంతు బలులను, రక్తాభిషూకాలు, రక్తతర్పణాలను అడ్డుకుని, అందుకు పాల్పడిన వారిని మందలించాల్సింది పోయి, జగన్ వారిని ప్రోత్సహించడం వల్లే పరిస్థితి ఇంత వరకూ వచ్చిందని ఇప్పుడు వైసీపీ క్యాడరే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. జగన్ తన కార్యకర్తలను కూడా క్రిమినల్స్ గానే తీర్చిదిద్దాలన్న భావనలో ఉన్నారు కనుకనే ఎంతగా రెచ్చిపోతే అంతగా ప్రోత్సాహం అన్నట్లుగా వారిని రెచ్చగొడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ పై కేసులు ఉన్నాయి.. అయితే ఆయన లీగల్ టీమ్ ను కోట్లు చెల్లించి మరీ పోషిస్తున్నారు. అయితే.. సామాన్య కార్యకర్తకు ఆ వెసులుబాటు ఉండదు. కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ నుంచి ఇసుమంతైనా సాయం అందదు. దీంతో వారు జైళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్ కార్యకర్తలను క్రిమినల్ కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే.. జగన్ తన హయాంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలను పట్టించుకున్న పానాన పోలేదు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం ఇంత చేస్తే తమకు జైళ్లు, కేసులూ బహుమతా అంటూ ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్న పరిస్థితి.
http://www.teluguone.com/news/content/cases-on-ycp-cadre-overaction-39-211767.html




