మావోయిస్టు అగ్రనేత మిసిర్ బేస్రా అరెస్టు.!

Publish Date:Jul 29, 2026

Advertisement

మావోయిస్టు అగ్రనేత సీపీఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బేస్రా అరెస్టయ్యారు.  గత నాలుగు దశాబ్దాలుగా భద్రతా దళాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మిసిర్ బిస్రా  తలపై 1 కోటి రూపాయల రివార్డు ఉంది.  ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాల్లో అనేక విధ్వంస కార్యకలాపాల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి   మిసిర్ బేస్రాఅరెస్ట్   దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భద్రతా బలగాల పక్కా వ్యూహంతో సాగించిన  ఆపరేషన్ లో మిసిర్ బేస్రా అరెస్టయ్యారు. 

ఝార్ఖండ్ రాష్ట్ర పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం,   కోబ్రా  బెటాలియన్   సంయుక్తంగా ధన్‌బాద్, గిరిడిహ్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని మంగళవారం (జులై 28)   అర్థరాత్రి సమయంలో చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో మిసిర్ బేస్రా ఉన్నారన్న సమాచారం అంతకు ముందు రోజు అంటే సోమవారం (జులై 27)  రాంచీలో 16 మంది మావోయిస్టులు అధికారుల ఎదుట లొంగిపోయారు.వారిలో మిసిర్ బేస్రాకు  వ్యక్తిగత అంగరక్షకుడు దేవాన్ ముర్ము అలియాస్ శనిచర్వా కూడా ఉన్నాడు. అతడి ద్వారా అందిన  సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.  దీంతో  మిసిర్ బేస్రా, అతనితో ఉన్న మరో ఇద్దరు కీలక రీజినల్ కమిటీ సభ్యులు కూడా చిక్కారు. 

ఝార్ఖండ్ లోని గిరిడిహ్ జిల్లా పిర్తాండ్‌ ప్రాంతానికి చెందిన మిసిర్‌ బేస్రా నాలుగు దశాబ్దాల కిందట  మావోయిస్టు   ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. ఉద్యమంలో భాస్కర్, సునిర్మల్, సాగర్ అనే  వేర్వేరు పేర్లతో కార్యకలాపాలు సాగించారు.  మిసిర్ బేస్రాపై  ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో   పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ  పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా   కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని   విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల   అజ్ఞాతంలోనే  ఉన్నారు.   

Misir Besra arrested, CPI Maoist Politburo member, Jharkhand Maoist arrest, Rs 1 crore reward Maoist, CRPF CoBRA operation, Naxalite commander captured

By
en-us Political News

  
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
ఇంత కాలంగా ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అదనపు బాధ్యతలు స్వీకరించినప్పుడు లేదా వేర్వేరు ప్రాజెక్టుల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి పదవికి ఒక వాహనం చొప్పున బహుళ వాహనాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2022 నాటి పాత మార్గదర్శకాలకు అనుబంధంగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఆర్థిక శాఖ వ్యయ విభాగం అటువంటి సదుపాయాలకు చెక్ పెట్టాయి.
హక్కుల హననానికి తోడు పీవోకేలో గళమెత్తుతున్న ప్రజలపై పాక్ బలగాలు పాశవిక అణచివేతకు పాల్పడుతున్నారు. గత రెండు రోజులుగా రావల్‌కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన దాడులు, కాల్పుల్లో 40 మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. పీవోకేలో జనం ప్రాథమిక హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం యుద్ధం ప్రకటించింది.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ సహజసిద్ధ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది
మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు, ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.