వరద సహాయ కార్యక్రమాలకు మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు

Publish Date:Sep 3, 2024

Advertisement

అధికారం అంటే హంగూ ఆర్భాటం కాదు, నిరాడంబరత, ప్రజా సేవ అని నిరూపిస్తున్నారు తెలుగుదేశం కూటమి మంత్రులు. కనీవినీ ఎరుగని రీతిలో వరద బెజవాడ నగరాన్ని జల దిగ్బంధం చేస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా, కూటమి ప్రభుత్వ మంత్రులంతా క్షేత్ర స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలలో భాగస్వాములై నిర్విరామంగా పని చేస్తున్నారు. బాధితులకు అండదండగా ఉంటామనీ, ఉన్నామనీ భరోసా కల్పిస్తున్నారు.  ఓ వైపు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాలు పంచుకుంటూనే, మరో వైపు సమీక్షల్లో పాల్గొంటూ మరింత మెరుగైన సేవలు అందించే విషయంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇలాంటి ఓ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఐటీ, మానవవనరుల మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనకు మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 

 వరద పరిస్థితుల్లో మంత్రులంతా తమతమ ఎస్కార్ట్ వాహనాలను విత్ డ్రా చేసుకుని వాటిని బాధితులకు సహాయ పునరావాల కార్యక్రమాలకు వినియోగించాలని లోకేష్ చేసిన ప్రతిపాదనకు మంత్రులంతా క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపారు. దీంతో వరద నేపథ్యంలో మంత్రులంతా ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వారి ఎస్కార్ట్ వాహనాలు బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహారం, తాగునీరు, మందులు తరలించే వాహనాలకు ఎస్కార్ట్ గా ఉంటాయి. చివరి బాధితుడి వరకూ సాయం అందాలన్న చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా ఆయన కేబినెట్ మొత్తం పని చేస్తున్నది. ఇంతటి విపత్తులోనూ బాధితులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.