ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని..జొమాటో బాయ్‌పై భార్యాభర్తల దాడి.!
Publish Date:Oct 4, 2026
Advertisement
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వాసవి నగర్లో నివాసం ఉంటున్న ఓ దంపతులు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే, లొకేషన్ తప్పుగా చూపించడంతో ఫుడ్ డెలివరీ కొంత ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్.. డెలివరీ బాయ్ ఆశిష్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఇంతలో కస్టమర్ భార్య జోక్యం చేసుకుని ఆశిష్ తలపై చేతితో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఫుడ్ డెలివరీ ఆలస్యమైందన్న కారణంతో డెలివరీ బాయ్‌పై దాడి చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దాడి అనంతరం ఆశిష్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, తనపై దాడి చేసిన ఘటనలో పోలీసులు చిన్న కేసు నమోదు చేశారంటూ ఆశిష్‌తో పాటు ఇతర డెలివరీ బాయ్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిష్ డిమాండ్ చేస్తున్నాడు. ఫుడ్ డెలివరీ ఆలస్యానికి లొకేషన్ తప్పుగా చూపించడమే కారణమా? లేక మరేదైనా సమస్య ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కారణం ఏదైనా.. వివాదాన్ని దాడి వరకు తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కస్టమర్లు, డెలివరీ సిబ్బంది మధ్య తలెత్తే వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. [ Zomato Delivery Boy, Zomato Delivery Agent Attack, Food Delivery Delay, Secunderabad News, Vasavi Nagar Incident, Karkhana Police, Delivery Boy Assault, CCTV Footage, Hyderabad Crime News, Customer Attack, Zomato News, Food Delivery Dispute, Ashish Delivery Boy, Telangana Crime News, Hyderabad Breaking News ]
http://www.teluguone.com/news/content/zomato-delivery-boy-25-233361.html





