పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలం : చంద్రబాబు

Publish Date:May 27, 2025

Advertisement

 

తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ కడప మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడపలో మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పార్టీ కోసం నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వేధించినా ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలు అందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి 7 స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలని చంద్రబాబు క్యాడర్‌కి పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించి అద్భుత విజయం సాధించామని తెలిపారు.

‘‘నేనో సైనికుడిని.. నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే.. మీరు నేను కలిస్తే మనకు ఆకాశమే హద్దు. మనం ఏ పనైనా చేయగలం. దీనికి మీరు సిద్ధమేనా’’ అని కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. నీతి నిజాయితీ రాజకీయాలు, విజన్ తో ముందుకు వెళ్లే రాజకీయాలకు టీడీపీ బ్రాండ్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అవినీతిపై పోరాడామని, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రహిత పాలన అందించామని వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా కూడా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు.. వాళ్ల పనే అయిపోయింది. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది.  

జగన్ విధ్వంస పాలనతో ఏపీన్ని సర్వ నాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు. వేటాడారు, వెంటాడారు.. అక్రమ కేసులు పెట్టారు. కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. మన పసుపు సింహం, కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. డిజిటల్ కరెన్సీ వచ్చా నోట్లు అవసరం లేదని పేర్కొన్నారు. దీని వల్ల అవినీతి తగ్గిపోతుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం డీమానిటైజేషన్ రద్దు చేసే సమయంలో తాను ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ టైమ్ లో డిజిటల్ కరెన్సీపై తాను ఒక రిపోర్ట్ ని ప్రధానికి ఇచ్చానన్నారు. 

500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసి, కొత్తగా 2వేల నోట్లు తీసుకొచ్చిన సమయంలో తాను ఓ కీలక సూచన చేసినట్టు చెప్పారు. 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లతోపాటు కొత్తగా తెచ్చిన 2వేల నోట్లు కూడా రద్దు చేయాలని, అన్ని పెద్ద నోట్లు రద్దు చేసేయాలని తాను ప్రధానికి సూచించానన్నారు. అలా నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీతో అవినీతికి చెక్ పెట్టినట్టవుతుందని చెప్పారు చంద్రబాబు.అవినీతి పూర్తిగా తగ్గించేందుకే ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్క వాట్సప్ మెసేజ్ తో పనిజరుగుతోందని, అధికారులు కూడా పారదర్శకంగా రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక విధానంలో కూడా పారదర్శకత అవసరం అన్నారు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.