దుబాయ్‌లోనే గౌతమ్‌ 'గుండె' వార్నింగ్?.. వీడియో వైర‌ల్...

Publish Date:Feb 22, 2022

Advertisement

గుండెపోటుతో ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర విషాదం నింపింది. అయితే.. అంతకు ముందు వారం రోజుల పాటు ఆయన దుబాయ్ లో జరిగిన ఎక్స్ పోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పాల్గొన్నారు. అలా దుబాయ్ పర్యటనలో.. ఎక్స్ పోలో ఉన్నప్పుడే గౌతమ్ రెడ్డికి చిన్నపాటి గుండెపోటు వార్నింగ్ వచ్చిందా? అనే విధంగా ఆయన వీడియో ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. దుబాయ్ ఎక్స్ పోలో గౌతమ్ రెడ్డి కాసేపు బాగా యాక్టివ్ గా కనిపించారు. అంత‌లోనే ఆయన కాస్త డల్ గా కూడా కనిపించారని తెలుస్తోంది. ఆ వీడియోలో గౌతమ్ రెడ్డి కుడిచేత్తో ఛాతీని పట్టుకున్న దృశ్యం కనిపిస్తోంది. అలా ఆయన ఒకటికి రెండు సార్లు ఛాతీని చేతి వేళ్లతో రుద్దుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది. అప్పటి వరకు చాలా హుషారుగా ఉన్న గౌతమ్ రెడ్డి ఆ తర్వాత కాస్త నెమ్మదిగా కనిపించారు.

పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి ఫిబ్రవరి 11న దుబాయ్ వెళ్లారు. వారం రోజులు దుబాయ్ లో పర్యటించారు. దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తున్నామని, మౌలిక వసతులు కల్పించడంలో ప్రాధాన్యం ఇస్తున్నామని ఎక్స్ పో వేదికగా తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి వివరంగా మాట్లాడారు. దుబాయ్ ఎక్స్ పోలో 12 థీమ్ లతో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ప్రారంభించారు. దుబాయ్ ఎక్స్ పోలో పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు.

గౌతమ్ రెడ్డి హైదరాబాద్ కు 20వ తేదీ తెల్లవారు జామున తిరిగి వచ్చారు. గౌతమ్ రెడ్డికి ఉదయాన్నే జిమ్ చేయడం అలవాటు. రాత్రి ఆలస్యంగా రావడంతో జిమ్ కు వెళ్లలేదు. ఆ రోజు సాయంత్రం గచ్చిబౌలిలో జరిగిన ఓ నిశ్చితార్థం కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

అయితే.. ఆరోగ్యం పట్ల, ఫిట్ నెస్ పట్ల ఎంతో శ్రద్ధగా ఉండే గౌతమ్ రెడ్డి ఛాతీ ఇబ్బంది కలిగినా ఎందుకు ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించలేదో అర్థంకాని పరిస్థితి. ఛాతీలో చిన్నపాటి నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ట్రిక్ అనో, ఇంకోదో చిన్న సమస్య అనో ఆయన లైట్ తీసుకున్నారా? అనిపిస్తోంది. దుబాయ్ లో రెండు రోజుల క్రితం గౌతమ్ రెడ్డి గుండె ఇచ్చిన చిన్నపాటి వార్నింగ్ మరో రెండు రోజుల్లో ఆయనను తుదిశ్వాస విడిచేలా చేసిందనే అభిప్రాయాం ఆ వీడియోను చూస్తే అర్థం అవుతోందంటున్నారు వైద్య నిపుణులు.

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.