1999లోనే చంద్రబాబు ముందుచూపు.. నేడు రూ.75 వేల కోట్ల ఆదాయం: గ్రంధి మల్లికార్జున రావు
Publish Date:Nov 13, 2026
Advertisement
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు. నేడు ఆ విమానాశ్రయం వల్ల ఏటా రూ.75 వేల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి” అని జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు అన్నారు. ఏపీ పారిశ్రామిక భవిష్యత్తుకు సరికొత్త దిశ.! విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు–2026లో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రాంధి మల్లికార్జున రావు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తు, ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం, నాయకత్వం కీలకంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతితో యువతకు ఉపాధి.! రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, కార్గో కనెక్టివిటీ అభివృద్ధి చెందితే ఏపీ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రశంసలు.! పెట్టుబడిదారులు ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వంపై నమ్మకం, విధానాల్లో పారదర్శకత, నిర్ణయాల్లో వేగం ఎంతో ముఖ్యమని మల్లికార్జున రావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ముందుచూపు, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ప్రశంసించారు. రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానం.! కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అభినందనీయమన్నారు. బలమైన నాయకత్వం, వేగవంతమైన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీకు నచ్చవచ్చు: సజ్జనార్ యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్..సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.! మీకు నచ్చవచ్చు: హైదరాబాద్ పోలీస్ బాస్ మార్పు.. సజ్జనార్ స్థానంలో మహేశ్ భగవత్.! [ CII Partnership Summit 2026, CM Chandrababu Naidu, GMR Group, Grandhi Mallikarjuna Rao, Shamshabad Airport, Hyderabad Airport ]
http://www.teluguone.com/news/content/cii-partnership-summit-2026-25-237005.html





