నెల్లూరుకు పోటెత్తిన జనం.. ప్రజల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి పార్ధివదేహం..
Publish Date:Feb 22, 2022
Advertisement
సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా మరణించి ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతదేహాన్ని నెల్లూరు తరలించారు. హైదరాబాద్ లోని నివాసం నుంచి ఉదయం ఆయన మృతదేహాన్ని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో నెల్లూరు తరలించారు. వెంట గౌతమ్ రెడ్డి తల్లి మణిమంజరి, భార్య శ్రీకీర్తి వెళ్లారు. అంతకు ముందే గౌతమ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు బయల్దేరి వెళ్లారు. నెల్లూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని తరలించి, డైకాస్ రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో ఉంచుతారు. అక్కడే ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. కాగా.. అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి హుటాహుటిన నెల్లూరుకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు ఆయన నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. గౌతమ్ రెడ్డి పార్ధివదేహానికి బుధవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్ లకు సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. గౌతమ్ రెడ్డి మృతికి రెండు రోజుల పాటు సంతాప సభలు నిర్వహించి నివాళులు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి హారజవుతారు. కాగా.. గౌతమ్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించేందుకు నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఆయన నివాసం వద్దకు భారీగా ప్రజలు, అభిమానులు చేరుకున్నారు. పలువురు మంత్రులు, పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. వైసీపీ నేతలు, మేకపాటి గౌతమ్ రెడ్డి అభిమానుల కోసం అధికారులు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్థలాన్ని జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది స్థలాన్ని పరిశీలించారు.
http://www.teluguone.com/news/content/mekapati-goutham-reddy-dead-body-to-nellore-39-132111.html





