గోషామహల్‌లో భారీ చోరీ...నిందితుడు అరెస్ట్

Publish Date:May 12, 2026

Advertisement

 

బాధితుడి సోదరుడే దొంగ.. 

 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు..

హైదరాబాద్ నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇళ్ల దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన రూ.5 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే 

బాధితుడు డి. మహేష్ మే 10న కుటుంబ సభ్యులతో కలిసి ఒక వేడుకకు హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. అర్ధరాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటం, అల్మారాలు పగులగొట్టబడినట్టు గమనించారు. ఇంట్లోని రూ.5 లక్షల నగదు, సుమారు 30 తులాల బంగారం, 1.62 కిలోల వెండి వస్తువులు దొంగతనానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గోషామహల్ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో బేగం బజార్ ముల్తానీపురాకు చెందిన దొంతుల రాజేష్ (37) దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 

దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. బాధితుడికి వరుసకు కజిన్ అయిన రాజేష్ పక్క ఇంట్లోనే నివసిస్తున్నాడు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు... అయితే రాజేష్ ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పులు వీటి కారణంగా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిందితుడు రాజేష్, బాధితుడి కుటుంబ కదలికలను ముందుగానే గమనిస్తూ, ఇంట్లో ఉన్న బంగారం పై కన్నేశాడు..

ఈ క్రమంలోనే మే 10 రాత్రి మహేష్ కుటుంబం లంగర్ హౌస్‌లో జరిగిన వేడుకకు వెళ్లిన విషయాన్ని గమనించిన రాజేష్, రాత్రి 9.30 గంటల సమయంలో పక్కింటికి పాలు ఇచ్చే నెపంతో వెళ్లి, అక్కడి నుంచి డాబా పైకి ఎక్కి బాధితుడి ఇంట్లోకి ప్రవేశించాడు. స్క్రూడ్రైవర్ సహాయంతో రెండో, మూడో అంతస్తుల తలుపులు పగులగొట్టి అల్మారాలోని నగదు, బంగారం, వెండి వస్తువులను చిన్న సంచిలో వేసుకుని తన ఇంట్లో దాచాడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఆటో తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. 

పోలీసులకు అతని కదలికలపై అనుమానం రావడంతో రాజేష్ ను అదుపులోకి తీసుకోవడంతో నిజం బయటపడింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, టైటాన్ వాచ్, 30 తులాల బంగారు ఆభరణాలు (లాంగ్ చైన్, లక్ష్మీ డిజైన్ నెక్లెస్, కమ్మలు, బుట్టలు, ముక్కుపుడకలు, గోల్డ్ బిస్కెట్), 1.62 కిలోల వెండి వస్తువులు (కడియాలు, పట్టీలు, దీపాలు, గిన్నెలు)తో పాటు కాంస్య వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.