పెళ్లికి ముందు అమ్మాయిలు కోరుకునేది ఇవే...!
Publish Date:Nov 1, 2017
Advertisement
జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే మధురమైన ఘట్టం పెళ్లి. అలాంటిది ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్బాయి కుటుంబం గురించి అమ్మాయి కుటుంబం వాళ్లు.. అమ్మాయి కుటుంబం గురించి అబ్బాయి కుటుంబం వాళ్లు చెక్ చేసుకుంటారు. అయితే ఇది ఒకప్పుడు కానీ.. రోజులు మారుతున్న కొద్ది.. ఆలోచనా విధానం కూడా మారుతుంది. ఇప్పుడు ఎవరికి వాళ్లు తమ భాగస్వామిని వారే వెతుక్కుంటున్నారు. తరువాత తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఇక ఆతరువాత ఒప్పుకుంటే సరే.. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత రోజుల్లో ఆమ్మాయిలు మాత్రం జీవిత భాగస్వామిని ఎంచుకుని, అతనితో కలసి ఏడడుగులూ నడిచి జీవితాన్ని పంచుకునే మధుర క్షణాలకు ముందు, ఎంతమాత్రమూ రాజీ పడేందుకు సిద్ధంగా లేదని ఓ కొత్త సర్వే నివేదిక వెల్లడిస్తోంది. పెళ్లి విషయంలో అమ్మాయిల్లోని మనోభావాలపై ప్రశ్నించగా వారు కొన్ని ఆసక్తికర అంశాలు తెలియజేశారు. అవేంటో చూద్దాం.. * ఈ కాలం అమ్మాయిలు పెళ్లి తరువాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండేందుకు సుముఖంగాలేరట. నలుగురితో కలిసుంటే, తమకు స్వేచ్ఛ ఉండదన్నది వారి భావన. * ఒకవేళ అమ్మాయికి కనుక ఎవరైన నచ్చితే... కులం, మతం, జాతకం వంటివి చూసేందుకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదట. * ఒకే ప్రొఫెషన్ లో ఉన్న వారైతే మంచిదని భావిస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఒకప్పుడు కాస్త అందంగా ఉండే వాడు వస్తే బాగుంటుంది అనుకున్న అమ్మాయిలే.. ఇప్పుడు ప్రొఫెషన్ తరువాతే అందాన్ని చూస్తున్నారట. * 80 శాతం మంది యువతులు విదేశీ వరుడు కావాలని కోరుకుంటుండగా, 65 శాతం మంది కుల మతాలతో పని లేదని, 50 శాతం మంది జాతకాలు చూడాలని అనుకోవడం లేదని అన్నారట. మొత్తానికి అమ్మాయిలు కూడా తమ భాగస్వామిని స్వతంత్రంగా ఎంచుకునే రోజులు రావడం ఆనందించాల్సిన విషయమే.
http://www.teluguone.com/news/content/marriage-39-78575.html





