మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాదా మృతి

Publish Date:Apr 3, 2026

Advertisement

మావోయిస్టు అగ్రనేత,  పొలిట్‌బ్యూరో సభ్యుడు  ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాదా కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు.  జార్ఖండ్‌లో జైలులో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన ఆయనను రాంచీలో  రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (ఏప్రిల్ 3) మరణించారు.  మరణించారని అధికారులు తెలిపారు.  
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్, మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావమంతమైన నాయకులలో ఒకరు.  కేంద్ర కమిటీ,  పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యుడిగా ఉండటంతో పాటు, ఆ సంస్థ యొక్క తూర్పు ప్రాంతీయ బ్యూరో కార్యదర్శిగా కూడా పనిచేశారు.ప్రశాంత్ కిషోర్ కిషన్ దాదా, మనీష్, బుద్ధ పేర్లతో కూడా గుర్తింపు పొందారు. 

2021 నవంబర్ 12న, సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని కంద్రా టోల్ బ్రిడ్జి సమీపంలో బోస్‌ను అతని భార్య షీలా మారండీతో పాటు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన తలపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.   ప్రశాంత్ బోస్  జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో పలు ఘటనలో పాల్గొన్నారు.  నాలుగు దశాబ్దాలుగా చురుకుగా ఉన్న ఆయన మావోయిస్టులకు కీలక వ్యూహకర్తగా,  సిద్ధాంతకర్తగా ఉన్నారు.  అరెస్టు అయినప్పటి నుంచి బోస్ జ్యూడీషియన్ కస్టడీలో ఉన్నారు.    

మావోయిస్టు అగ్రనేతలు అయిన నంబాల కేశవరావు, చెరుకూరి రాజ్‌కుమార్, పటేల్ సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి పని చేసిన ప్రశాంత్ బోస్ పీపుల్స్ వార్.  ఎంసిసి విలీనంలో కీలకపాత్ర పోషించారు.  విభిన్న విప్లవ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రశాంత్ బోస్ మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు అండర్‌గ్రౌండ్ రాజకీయాల్లో కొనసాగిన ఆయన జీవితం ఇప్పుడు ముగిసింది.

By
en-us Political News

  
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
పిఠాపురం ఏఈ నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై  దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్‌ఫర్‌ల ప్రక్రియను పారదర్శకంగా,  నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు.
ఇటీవల ఒక సందర్భంలో  అనసూయ.. సనాతన ధర్మంతో పాటు జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
1972 లో అపోలో 17 మిషన్ ద్వారా  మానవుడు తొలి సారిగా చందమామపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఐదు దశాబ్దాల తరువాత.. నాసా  ఇప్పుడు కేవలం చందమామపై కాలుపెట్టి వచ్చేయడమే కాకుండా.. నెల నుంచి రెండె నెలల పాటు మనిషి అక్కడే నివసించడానికి వీలుగా ఒక పర్మనెంట్ బేస్ క్యాంప్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. 
ఇరాన్ లోకి   చొరబడే అమెరికా సైనికులను మట్టుబెట్టినా లేదా సజీవంగా బంధించి అప్పగించినా భారీ నగదు బహుమతి ఇస్తామంటూ పత్వా ప్రకటించింది. ఈ ఫత్వా సాక్షాత్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ  అఫీషియల్ గా ప్రకటించడం గమనార్హం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.