ఆర్కే వర్సెస్ లోకేశ్.. మంగళగిరి గ్రౌండ్ రియాలిటీ..

Publish Date:Dec 24, 2021

Advertisement

రాజకీయ నాయకులకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలలో మొదటి లక్షణం విశ్వాసం. రెండవది విశ్వసనీయత. తమపై తమకు విశ్వాసం ఉండడంతో పాటు ప్రజలపై విశ్వాసంతో ముందుకు సాగితే, జనంలో విశ్వసనీయత బలపడుతుంది. ఇక అప్పుడు వద్దన్నా విజయం వరిస్తుంది. ఇది అనేక సందర్భాలలో రుజువైన నిజం. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్’లో ఇప్పుడు ఈ లక్షణం  పుష్కలంగా కనిపిస్తోంది. రేపటి ఎన్నికల్లో విజయం తధ్యం అన్న ధీమా ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. 

లోకేష్, మొదటి సారిగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడి పోయారు. వైసీపీ అభ్యర్ధి  ఆళ్ళ రామకృష్ణా రెడ్డి-ఆర్కే ఐదు వేల స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. అయితే లోకేష్ ఓటమితో కృంగి పోలేదు. ఓటమిని సవాలుగా తీసుకున్నారు. ఎక్కడ పారేసుకున్నారో అక్కడే వెతుక్కోవడం ప్రారంభించారు, మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి, ఎమ్మెల్యే ఆర్కే కంటే, ఎక్కువగా ప్రలతో కలిసి పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అమరావతి ఉద్యమం కూడా కలిసి రావడంతో తరచుగా ఇక్కడ పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వారిలో నైతిక స్ధైర్యం నింపుతున్నారు. ఈ నేపధ్యంలోనే వరసగా మూడు రోజులు నియోజక వర్గంలో పర్యటించిన లోకేష్, 2024 ఎన్నికల్లో మంగళగిరిలో తమ గెలుపు పైనే కాదు రాష్ట్రంలో  తెలుగు దేశం పార్టీ విజయం పై కూడా  సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. ఇందుకు సంబందించి విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్, ఒక్క నిముషం  ఆలోచించకుండా, ‘ఎనీ డౌట్’ .. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు. 

అదలా ఉంటే మంగళగిరిలో నియోజకవర్గంలో మారిన పరిస్ధితులు పూర్తిగా కలిసొస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, వాటికి సహకరిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే తీరు లోకేష్’కు వరంగా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్నఆర్కే, రాజధాని విషయంలో జగన్ రెడ్డికి వంత పాడడంతో ఆయన పలుకుబడి పలచబడిపోయింది . అందుకు తోడు నియోజక వర్గంలో ఎక్కడా అభివృద్ధి అన్నది లేక పోవడం, మరోవంక ఓటీఎస్, ఇళ్ళ కూల్చివేతలు ఆర్కే’ ఓటమిని  ముందుగానే ఖరారు చేస్తున్నాయని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర మంతటా వ్యతిరేకత ఉన్నా మంగళగిరి నియోజక వర్గంలో అది మరీమరీ ఎక్కువగా ఉందని అంటున్నారు.  

ఈవిధంగా మంగళగిరి నియోజక వర్గంలో మారుతున్న పరిస్ధితుల్ని లోకేష్ చక్కాగా తమకు అనుకూలంగా మలచు కుంటున్నారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అర్కేకు ఇప్పటి నుంచే  చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో రాజధాని ఎక్కడికి పోదు ఇక్కడే ఉటుందని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న ఆర్కే, ఇప్పడు ముఖ్యమంత్రి కుట్రలో భాగస్వామి అవుతున్నారని, అందుకే  నియోజక వర్గం ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కిమ్మనడం లేదని  ప్రజలు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. అలాగే, గతంలో ఆర్కే అమరావతి రైతుల్ని, ఉద్యమాన్ని చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో మరింత ఆగ్రహం తెప్పించాయి. చివరకు సమస్యలు  చెప్పుకునేందుకు వచ్చిన రైతులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే తమను అవమానపరుస్తున్నారని జనం మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఆర్కేపై పెరుగుతున్న వ్యతిరేకతతో పాటు మూడు రాజధానులపై జగన్ సర్కార్ దూకుడు తనకు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కలిసొస్తుందని లోకేష్ ధీమాగా కనిపిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.