Publish Date:Apr 30, 2026
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న తరుణంలో కోల్‌కతాలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం (ఏప్రిల్ 30) రాత్రి కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న ఆమె.. అక్కడ సుమారు మూడు గంటల పాటు ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. ఇది తమకు చావో రేవో తేల్చుకునే పోరాటంటూ ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు, తృణమూల్ కాంగ్రెస్ ( నాయకులు కునాల్ ఘోష్, శశి పంజా ఖుదీరామ్ అనుశీలన్ స్ట్రాంగ్ రూం వెలుపల వెలుపల ధర్నాకు దిగారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేకుండానే బాలెట్ బాక్సులను తెరుస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పార్టీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
మరోవైపు.. కేంద్ర దళాలు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి లేదా ఏజెంట్ స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లే అధికారం ఉంటుందన్నారు. తమ పార్టీ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫలితాలు వెలువడే మే 4వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాగా ఈ ఆరోపణలను పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం.. మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయంది. . సిసిటివి ఫుటేజీలో కనిపిస్తున్నది కేవలం పోస్టల్ బ్యాలెట్ల విభజన ప్రక్రియే తప్ప.. ఈవీఎంలను తాకడం లేదని వివరణ ఇచ్చింది.
ప్రస్తుతానికి బెంగాల్‌లో రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో.. ప్రతి ఓటును కాపాడుకోవాలన్న పట్టుదలతో టీఎంసీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలని మమతా బెనర్జీ తమ పార్టీ అభ్యర్థులను ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mamata-banerjee-at-the-strong-room-at-midnight-25-218682.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.