మహా కుంబమేళాలో తళుక్కుమని ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయిన తేనెకళ్ల సుందరి అలియాస్ మోనాలిసా భోస్లే ఇప్పుడు సినిమా హీరోయిన్ కూడా కాబోతున్నది. రాత్రికి రాత్రి వచ్చిన పాపులారిటీతో ఉక్కిరిబిక్కిరై మహా కుంభమేళా నుంచి వెళ్లిపోయిన ఆమెను బాలీవుడ్ వదల లేదు. కళ్లుతిప్పుకోలేని అందంతో మెరిసిపోయే ఆమెను వెండి తెరకు పరిచయం చేయడానికి బాలీవుడ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. త్వరలో ఆమె నటించబోయే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోయిన్ అయిన రేఖ పొలికలు ఒకింత ఉన్న ఆమెకు ఆమె తేనెకళ్లు ఎక్స్ట్రా ఎట్రాక్షన్ గా మారాయి. అందుకే ఆమెను బాలీవుడ్ వెతుక్కుంటూ వెళ్లి మరీ సినిమా చాన్స్ ఇచ్చింది. తన తొలి సినిమాతోనే పాపులర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కుమార్తెగా నటించే చాన్స్ కొట్టేసింది.
ఇక విషయానికి వస్తే.. మోనాలిసా ఇప్పుడు తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు ఆమెను పాపులర్ చేసిన సోషల్ మీడియానే ఆశ్రయిస్తోంది. అంతే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ కు తగినట్లుగా సోషల్ మీడియాను వినియోగించుకుంటోంది. తాజాగా సోమవారం ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. నెటిజనులను విపరీతంగా ఆకర్షించేసింది. ఇంతకీ ఆమె పోస్టు ఏమిటంటే.. అల్లు అర్జున్ నటించిన పుష్పా2 సినిమా పోస్టర్ పక్కన నుంచి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోనాలిసా భోస్లే..ఆ పోస్టుకు ఇప్పుడు పోస్టర్ పక్కన ఉన్నాను .. రేపు పోస్టర్ పై ఉంటాను అన్న క్యాప్షన్ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సృష్టించిన పుష్ప సినిమా2 క్రేజ్ ను తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు మోనాలిసా భోస్లే చక్కగా వాడుకుందని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maha-kumb-monalisa-active-on-social-media-25-192286.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.