జ్యువెలరీ షోరూమ్‌లో భారీ దోపిడీ.. రూ.50 కోట్ల బంగారం చోరీ.!
Publish Date:Nov 12, 2026
Advertisement
తమిళనాడులోని మదురైలో జరిగిన ఒక సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మదురైలోని కలవాసల్ బైపాస్ రోడ్డులో గల పలంగనాథం ప్రాంతంలో ఇటీవల అత్యంత వైభవంగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక 'తనిష్క్' జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ వెలుగుచూసింది. కేవలం పది రోజుల క్రితం మాత్రమే ప్రారంభమైన ఈ సరికొత్త ఆభరణాల దుకాణంలో, భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే సుమారు 70 శాతం మేర మాత్రమే పూర్తయ్యాయి. ఈ లోపు దుండగులు వేసిన ప్లాన్ చూసి పోలీసులే విస్మయం చెందారు. నవంబర్ 10వ తేదీ రాత్రి యథావిధిగా సిబ్బంది దుకాణానికి తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోగా, మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి వెనుక వైపు తలుపులు, షట్టర్లు పగులగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే షాక్‌కు గురయ్యారు. ఈ దుండగుల దురాగతంలో దాదాపు 15 నుంచి 20 కిలోల (సుమారు 16 కిలోల వరకు) బంగారు, వజ్రాభరణాలు మాయమైనట్లు ప్రాథమిక అంచనా వేశారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఈ బ్రాండ్ షోరూమ్‌లో చోరీకి గురైన ఆభరణాల మార్కెట్ విలువ సుమారు రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.! షోరూమ్‌లో ఉన్న మొత్తం నిల్వలలో దాదాపు 30 శాతం మేర బంగారం ఈ భారీ దోపిడీకి గురైనట్లు మదురై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ మీడియా వెల్లడించారు. అయితే, ఈ ఘరానా దొంగతనం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు సీసీటీవీ ద్వారా స్పష్టమవుతోంది. నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా భవనం పై అంతస్తు నుంచి లిఫ్ట్ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది. ముఖానికి మాస్క్ ధరించిన ఒకే వ్యక్తి ఈ దుండగానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడు భారీ మొత్తంలో ఉన్న నగలను ఎత్తుకెళ్లడానికి ఉపయోగించిన ట్రావెల్ బ్యాగ్ సైజు, డిజైన్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ల పర్యవేక్షణలో ప్రత్యేకంగా మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ (జాగిలాలు), ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, క్లూస్‌ను సేకరిస్తున్నారు. కేవలం పది రోజుల క్రితం ప్రారంభమైన షోరూమ్‌లో ఇంత భారీ మొత్తంలో దోపిడీ జరగడం వ్యాపార వర్గాల్లో, స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. మీకు నచ్చవచ్చు: రూ.7 కోట్లు ఇవ్వాలి.. లేదంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు హత్య బెదిరింపులు.! [ Madurai Tanishq showroom theft, 16 kg gold stolen Madurai, Tanishq jewellery robbery Tamil Nadu, Rs 50 crore gold stolen, Palanganatham Tanishq heist, Madurai crime news today ]
http://www.teluguone.com/news/content/madurai-tanishq-showroom-theft-25-236920.html





