బంగళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు!
Publish Date:Oct 29, 2024
Advertisement
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు తెలంగాణలో మంగళ, బుధవారాలలో (అక్టోబర్ 29, 30) విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచిం చారు.అలాగే బుధవారం (అక్టోబర్ 30) ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గండ, సూర్యాపేట, మహబూ బాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక ఏపీలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ల వద్దనీ సూచించింది.
http://www.teluguone.com/news/content/low-depression-in-bay-of-bengal-39-187611.html