తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బోల్తా పడ్డారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యం అన్నది పైపై మాటే వాస్తవంగా ఆయన దేశానికి ప్రధాని కావాలన్న ఆంక్ష, కాంక్ష తోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి, తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల రాజకీయాలలో తలదూర్చారన్నది పరిశీలకులు విశ్లేషణ.
అనంతపురం కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్ సంచలనమైంది. శుక్రవారం తెల్లవారు జామున కలెక్టరేట్ లో గార్డు డ్యూటీలో ఉన్నాడు.1996 బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు తన వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది.
ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్ర విభజన తో అప్పులు వినా ఆస్తులు లేని రాష్ట్రంలో, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అన్నిటికీ మించి రెవెన్యూ లోటుతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాధలా మిగిలింది. అలాంటి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దగలిగేది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని విశ్వసించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు.
ప్రధాని నరేంద్రమోడీ సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. దీపావళి పర్వదినం రోజున గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి దీపావళిని వేడుకగా జరుపుకున్నారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు , నటుడు, దర్శకుడు చారుహసన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, అలనాటి నటి సుహాసిని ధృవీకరించారు. చారుహసన్ అనేక చిత్రాల్లో నటించారు. దర్శకత్వం వహించారు కూడా. చెన్నయ్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీలలో భాగంగా రేవంత్ సర్కార్ అమలు చేసిన తొలి హామీ కూడా ఇదే. అంతకు మందే కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడానికి ఆ హామీ ఎంతో దోహదపడింది.
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వీకెండ్ దగ్గర పడటం, దీపావళి సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) సెలవు దినం కావడంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో వస్తున్నారు.
Publish Date:Oct 30, 2024
ఇటీవలికాలంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. హైదరాబాద్ శంషాబాద్ వియానాశ్రయంలో ఏకంగా ఆరు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ సిబ్బందికి ఎదురయ్యాయి.
Publish Date:Oct 30, 2024
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు పార్టీల నేతల మధ్యా సయోధ్య చక్కగా కుదిరింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని నిర్ణయాలలోనూ సమష్టిగా ముందుకు సాగుతోంది.
Publish Date:Oct 30, 2024
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబపరంగానూ, రాజకీయంగానూ పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఆయన కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు రాజకీయాలకు అతీతంగా వైఎస్ అభిమానులందరి మద్దతూ లభించింది. ఇటు కుటుంబం కూడా ఆయన వెన్నంటి నడిచింది. ఇలా అన్ని వైపుల నుంచీ, అందరి నుంచీ మద్దతు లభించడం వల్లనే ఆయన తన వైసీపీ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ నడపగలిగారు, 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగలిగారనడంలో సందేహం లేదు.
Publish Date:Oct 30, 2024
సీబీఐ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ గా వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వెంకట సుబ్బారెడ్డి ఐపీఎస్ ను సీబీఐ డిఐజీగా నియమిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు.
Publish Date:Oct 30, 2024
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రెండు కోట్లు ఇవ్వకుంటే ఖతం చేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపాడు. దీంతో వర్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Publish Date:Oct 30, 2024
జన్వాడ పార్టీ రేవ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో మోకిలా పోలీసులు రాజ్ పాకాల, విజయ్ మద్దూరీ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు.