ఒక్క నెలలో మీ బరువు తగ్గిపోయే చిట్కా..

Publish Date:May 25, 2018

Advertisement

 

 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య- అధిక బరువు. మనం తినే ఆహారం దగ్గర్నుంచీ చేసే పని వరకూ అన్నీ అధిక బరువుకే దారి తీస్తున్నాయని మనకి తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో అప్పుడో చిట్కా అప్పుడో చిట్కా ప్రయత్నించి చూస్తేనే ఉంటాం కానీ... అవేవీ పని చేయడం లేదని నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఎక్కువ నీళ్లు తాగడం దగ్గర నుంచీ రాత్రి తిండి మానేయడం వరకూ ఒబెసిటీ తగ్గించుకు మనం పాటించని చిట్కా అంటూ ఉండదు. కానీ ఇప్పుడు మనం వినబోయే ఒక పద్ధతి నిజంగానే అధిక బరువుని తగ్గిస్తుందని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

ఈ పద్ధతిలో ఉపయోగించే రెండు వస్తువులూ ఇంటింటా కనిపించేవే! అవే దాల్చిన చెక్క, తేనె. ఇప్పుడంటే దాల్చిన చెక్కని మసాలాల్లో మాత్రమే వాడుతున్నారు కానీ, దానికి ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. డయాబెటిస్ దగ్గర నుంచీ డెంటల్‌ సమస్యల వరకూ దాల్చిన చెక్క వల్ల చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక అధిక బరువు ఉన్నవారికైతే దాల్చిన చెక్క ఓ వరంలా పనిచేస్తుందట.

మన ఒంట్లో కొవ్వు కణాలను కరిగించేందుకు, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అంతేకాదు! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటబాలిజంను పెంచుతుంది. దాని వల్ల అప్పటివరకూ పేరుకున్న కొలెస్టరాల్‌ కూడా కరిగిపోతుంది. దాల్చిన చెక్క బాగా వేడి చేస్తుందని పెద్దలు చెప్పడానికి కారణం ఇదే!

ఇక తేనె సంగతి చెప్పేదేముంది! తేనె వల్ల లివర్‌ పనితీరు మెరుగుపడి, షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాని వల్ల ఇంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. అందుకనే ఒక నెల రోజుల పాటు దాల్చినచెక్క, తేనె కలిపి తీసుకుంటే... ఒబెసిటీ సమస్య దూరమైపోతుందని చెబుతున్నారు. దీని కోసం గోరువెచ్చటి నీరు ఉన్న ఒక కప్పులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్‌ తేనె కలిపి తీసుకోవాలి. పరగడుపునే ఖాళీ కడుపు మీద ఈ టానిక్‌ తీసుకుంటే మరీ మంచిది. కానీ కొంతమందికి దాల్చిన చెక్క పొడి వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు, రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది.

అధిక బరువు వల్ల కేవలం అందం మాత్రమే దెబ్బతినదు. మన ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఇక ఆ బరువుతో పాటు పలకరించే అనారోగ్య సమస్యల గురించి తెలసిందే! అందుకే ఈ చిన్న చిట్కాతో మీ బరువు తగ్గించేసుకోండి. లైఫ్‌ ని హ్యాపీగా గడిపేయండి.

నిర్జర

By
en-us Political News

  
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.