లోకేష్ చొరవతో గణేష్, దసరా మండపాలకు ఉచిత విద్యుత్

Publish Date:Aug 26, 2025

Advertisement

తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణానికి మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం మరింత శోభను ఇచ్చింది. తెలుగురాష్ట్రాలలో బుధవారం (ఆగస్టు 27) నుంచి వినాయక చవిత నవరాత్రులు అత్యంత వైభవంగా, అంబరాన్నంటే సంబరంతో జరగనున్నాయి. వీధి వీధినా గణేష్ పందిళ్లు వేసి తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రులను అత్యంత వేడుకగా జరుపుకోవడం తెలుగురాష్ట్రాలలో ఆనవాయితీ. ఇక ఈ వేడకకు మరింత శోభ, నిర్వాహకులకు, భక్తులకు మరింత ఆనందం చేకూర్చేలా మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న మండపాల నిర్వాహకుల వినతి లోకేష్ వద్దకు చేరింది. ఆయన క్షణం ఆలోచించకుండా అందుకు సానుకూలంగా స్పందించారు.  

మండప నిర్వాహకుల వినతిపై యఆయన సామాజిక మాధ్యమ వేదికగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన మేరకు వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడతాయి. అన్నది ఆ ప్రకటన సారాంశం. ఆయన అన్నట్లుగానే గణపతి మంటపాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతే కాదు. వినాయక చవితి తరువాత వచ్చే దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు కూడా ప్రభుత్వం విద్యుత్ ను ఉచితంగా అందించనుంది. ఈ రెండు పండుగలకూ సంబంధించి ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం పాతిక కోట్ల రూపాయలు కేటాయించింది.  ఈ నిర్ణయంతో మంత్రి లోకేష్ ప్రజా నాయకుడిగా తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నట్లు అయ్యింది.  

చూడటానికి గణేష్, దసరా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అన్నది ఒక చిన్న చర్య గా కనిపించవచ్చు. కానీ ఇది ప్రజా హృదయాలపై చాలా బలమైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు. ఆబాలగోపాలం ఆనందంగా భాగస్వాములై నిర్వహించుకునే ఈ రెండు పండుగల విషయంలో లోకేష్ చూపిన చొరవ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచేయడమే కాదు.. తెలుగుదేశం కూటమి ప్రతిష్ఠను కూడా ఇనుమడింప చేసిందనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.