రంగంలోకి దిగిన లోకేష్
Publish Date:Jan 17, 2013
Advertisement
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో తమ స్వగ్రామమయిన నారావారి పల్లెకు వచ్చినప్పుడు, తన రాజకీయ కార్యక్రమాలను కూడా ఆరంభించాడు. పండుగ సంభారాలలో మునిగున్న తెలుగు తమ్ముళ్ళకు నారా లోకేష్ స్వయంగా తమను కలవడం వారికి మరింత ఆనందం కలిగించింది. పార్టీ అధ్యక్షుడే స్వయంగా జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్నపటికీ, గత కొంత కాలంగా జిల్లా వైపు కన్నెత్తి చూడడానికి కూడా తీరికలేని రాజకీయాలలో తలమునకలవుతున్న కారణంగా, తెలుగుదేశం కార్యకర్తలలో మునుపటి ఉత్సాహం కొరవడింది.ఆకారణంగా కొందరు పార్టీ నేతలు, కార్యకర్తలూ క్రమంగా ఇతర పార్టీలవైపు ఆకర్షితులవుతున్న సంగతి తెలియడంతో యువనేత లోకేష్ జిల్లారాజకీయాలపై తన దృష్టి సారించాడు. లోకేష్ స్థానిక నేతలతో, పార్టీ కార్యకర్తలతో దఫా దఫాలుగా అనేక సార్లు సమావేశం అయ్యాడు. జిల్లాలో పార్టీ పరిస్థితిని తెలుసుకోనడమే గాకుండా వారి అభిప్రాయాలను, సూచనలను ఎప్పటికప్పుడు తన ల్యాప్ టాప్ కంప్యుటర్ లో నోట్ చేసుకొన్నట్లు సమాచారం. స్థానిక నేతలు, అతనితో నియోజక వర్గ ఇన్-చార్జుల నియామకాల గురించి ప్రస్తావించినప్పుడు,మరొక నెల, నెలన్నర సమయంలో చిత్తూరు మరియు తెలంగాణ జిల్లాలలో అన్ని నియోజక వర్గాలకు ఇన్-చార్జుల నియామక ప్రక్రియ పూర్తీ చేయనున్నట్లు లోకేష్ తెలిపాడు. ఈ సమావేశాలలో అతను ముఖ్యంగా తంబళ్లపల్లి, చంద్రగిరి,పుంగనూరు, పీలేరు, పీలేరు నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ పూర్తీ వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, గతంలో ఈ నియోజకవర్గాలలో పార్టీ అధిష్టానం మరియు స్థానికనేతల మధ్య సరయిన అనుసంధానం జరగకపోవడం చేత తీవ్రమయిన తప్పిదాలు కొన్నిజరిగి, తద్వారా పార్టీకి కూడా తీవ్ర నష్టం జరిగిందని పేర్కొంటూ, ఇక ముందు అటువంటి పొరపాట్లు పునారావృతం కాకుండా తానూ శ్రద్ధ తీసుకొంటానని చెప్పడంతో పార్టీ నాయకులూ సంతోషం వ్యక్తం చేసారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా లోకేష్ స్వయంగా ఈ విధంగా చొరవ తీసుకొని స్థానిక నేతలతో, మమేకం కావడం జిల్లాపార్టీ శ్రేణులు చాలా ఉత్సహంగా ఉన్నారు.
http://www.teluguone.com/news/content/lokesh-24-20434.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





