Publish Date:Jan 25, 2022
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. పార్టీ స్థాపించిన వేళ విశేషం ఏమిటో కానీ.. ఆమెకు ఏదీ కలిసి రావడం లేదు. ఆమెకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నట్లు తెలుస్తోందీ. ఇటీవల కోవిడ్ మహ్మమారి విజృంభించిందీ. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్‌లోని ఆమె కార్యాలయ సిబ్బందిలో పలువురికీ కరోనా పాజిటీవ్ వచ్చినట్లు సమాచారం. దాంతో లోటస్ పాండ్‌కు తాళం వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కార్యాలయానికి ఎవరు రావద్దంటూ సిబ్బందితోపాటు లీడర్ నుంచి క్యాడర్ వరకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయట. దీంతో వారం రోజుల పాటు లోటస్ పాండ్‌లోని వైయస్ షర్మిల కార్యాలయానికి తాళం వేశారని సమాచారం. దీంతో ఎలాంటి యాక్టివిటీ లేక పోవడంతో సదరు కార్యాలయం వెలవెల బోతోంది. గతంలోనూ సెకండ్ వేవ్ కారణంగా.. కార్యాలయ సిబ్బంది కోవిడ్ బారిన పడి.. ఆసుపత్రిలో చేరిన సంఘటనలు చాలానే ఉన్నాయని... ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని పార్టీలోని కీలక నేతలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీని స్థాపించిన వైయస్ షర్మిల.. కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, రైతుల కుటుంబాలను సైతం వైయస్ షర్మిల పరామర్శించారు. ఆ క్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 400 రోజుల పాటు, 4 వేల కిలోమీటర్ల మేర ప్రజా ప్రస్థాన యాత్ర పేరిట వైయస్ షర్మిల పాదయాత్రను చేపట్టారు. కానీ ఆమె పాదయాత్ర చేపట్టిన 21 రోజులకే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిందీ.. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కరోనా విజృంభించడంతో వైయస్ షర్మిల పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి.
అదీకాక.. తెలంగాణలో పార్టీ పెట్టవద్దంటూ ఏపీ సీఎం, సోదరుడు వైయస్ జగన్ చెప్పినా.. వైయస్ షర్మిల మాత్రం తెలంగాణలో పార్టీని స్థాపించారు. అయితే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో సైతం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఒప్పందం చేసుకుంది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో.. సీఎం కేసీఆర్ కంగుతున్నారు. దీంతో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం కోసం గులాబీ బాస్.. కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో ప్రశాంత్ కిషోర్‌లో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని సమాచారం.
ఈ నేపథ్యలో గతంలో వైయస్ షర్మిల పార్టీతో చేసుకున్న ఒఫ్పందాన్ని ప్రశాంత్ కిషోర్ రద్దు చేసుకుంటున్నారని తెలుస్తోందీ. అలాగే తెలంగాణలో పార్టీ పెట్టి నడపడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని.. పాదయాత్ర ఆపి.. పార్టీ మూసేయాలంటూ ఈ సందర్భంగా వైయస్ షర్మిలకు ప్రశాంత్ కిషోర్ సూచించారని... కానీ వైయస్ షర్మిల మాత్రం ఇవేమీ పట్టనుట్లు.. తెలంగాణలో పార్టీని ఉరికించాలని భావిస్తుందన తెలుస్తోందీ. అయితే వైయస్ షర్మిలకు ప్రస్తుతం కాలం కూడా కలిసి రావడం లేదని.. రాజకీయం అంటే.. అన్నీ కలిసి రావాలి.. అందరిని కలుపుకుపోవాలి... అలా అయితేనే రాజకీయంగా ఎదుగుతాం.. ఎన్నికల్లో గెలుస్తాం. అంతేకానీ.. ఎవరు లేకుండా... ఒక్కరే వెళ్లితే.. ఒక్కరుగానే మిగిలిపోయే పరిస్థితి లేక పోలేదనే కామెంట్స్ సైతం.. షర్మిల పార్టీలో వినిపిస్తున్నాయి. మరి వైయస్ షర్మిల ఎం చేస్తుందో వేచి చూడాలని.. ఆమె పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lock-to-lotus-pond-39-130735.html
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.