Publish Date:Jan 25, 2022
ఎన్నికల వేళ, ఉత్తర ప్రదేశ్’లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసిన, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, సింగ్ పేరును స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చిన కొద్ది గంటల్లోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్ లేదని, ముందున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి కాంగ్రెస్’కు పొంతనే లేదని అందుకే కాంగ్రెస్ పార్టీని వదిలినట్లు చెప్పారు. ఆయన తమ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ తన రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తీసుకుందని, ఇక్కడి నుంచి కొత్త ప్రస్థానం సాగుతుందని సింగ్ ట్విట్ చేశారు. ఎన్నికల సమయంలో ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అదలా ఉంటే, మరో పక్షం రోజులో ఫిబ్రవరి 10 న తొలి విడత పోలింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థులను ప్రకటించి.. పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరో వంక ఫిరాయింపులూ కొనసాగుతున్నాయి. ప్రధాన పోటీ, బీజేపీ, ఎస్పీల మధ్యనే అయినా, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నాయి. కింగ్ కాకున్నా కింగ్ మేకర్ కావాలని ఆశ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత, యూపీ ఎన్నికల సారధి ప్రియాంకా వాద్రా ఎన్నికల తర్వాత అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ, ఎస్పీకి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందని, ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆర్పీఎన్ సింగ్ చెప్పారు. యూపీ ప్రజలు తనను ఎప్పటి నుంచో బీజేపీలో చేరాలని కోరుతున్నారని.. ఇప్పటికి సాధ్యపడిందని పేర్కొన్నారు. ఆర్పీఎన్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ ప్రతినిధి శశివాలియా, పార్టీ కార్యదర్శి రాజేంద్ర ఆహ్వాన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సింగ్ చేరికను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. బీజేపీలో సింగ్ చేరికతో యూపీలో పార్టీ మరింత బలపడుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు. నిజానికి యూపీలో కాంగ్రెస్ పోటీలోఉన్నా లేనట్లేననే అభిప్రాయం ఎప్పటి నుంచో వ్యక్తమవుతోంది. ఆర్పీ సింగ్ రాజీనామాతో మరో సారి రుజువిందని పరిశీలకులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-minister-jumps-to-bjp-39-130738.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.