Publish Date:Jun 14, 2012
బెయిల్ మంజూరు కాకపోవటంతో వారంక్రితం అరెస్టు అయిన తిరుపతికి చెందిన ఇద్దరు మద్యం వ్యాపారులు ఎసిబి అదుపులోనే ఉండిపోయారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్లపై ఎసిబి పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. ఈ దశలో ఆ ఇద్దరు వ్యాపారులు తమ గురించి ఏమి చెప్పారో అని అటు ఎక్సైజ్ అధికారులు, ఇటు తోటి మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎం.ఆర్.పి. కన్నా 30 శాతం అదనంగా వ్యాపారం చేసేందుకు ఎక్సైజ్ శాఖకు, సిండికేట్ కు రోజువారీ వాటాలు చెల్లించిన ఆ వ్యాపారులు పూర్తి వివరాలు చెప్పేసే ఉంటారని సిండికేట్ అభిప్రాయపడుతోంది. అందుకే వీరిద్దరికీ బెయిల్ గురించి అసలు ప్రయత్నాలే చేయలేడు. బంధువులు మాత్రం బెయిల్ కోసం న్యాయవాదుల సహాయం తీసుకుంటున్నారు. పలమనేరుకు చెందిన నాగభూషణం, చిత్తూరుకు చెందిన కొండారెడ్డిలను ఈ నెల 6న ఎసిబి స్వయంగా అరెస్టు చేసింది పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి ప్రాంతాల్లో 15 మాధ్యమషాపులను అధికమొత్తంలో కట్టి రెండేళ్ళక్రితం కొందరు వ్యాపారులు సొంతం చేసుకున్నారు. రెండు షాపులకు 82లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. అంటే రోజుకు రూ. 80వేల మద్యం అమ్మకాలు జరగాలి. అందుకే ఎం.ఆర్.పి.కి 30 శాతం అదనంగా అమ్మకాలు సాగించారు. అద్దెతో సహా లాభాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే ప్రతీ నేలా ఎక్సైజ్ శాఖకు, ప్రజాప్రతినిథులకు డబ్బులు ఇచ్చేవారు.
ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో, ఎలా ఇచ్చారో పూర్తి వివరాలు తెలిపే ఉంటారని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. ఇంతకీ వారేమి చెప్పాతో ఎసిబి ఎలా ఇంటరాగేట్ చేసిందో తెలియాలంటే ఆ ఇద్దరు వ్యాపారులు బెయిల్ పై బయటకు రావాల్సిందే! అందుకే వీరిద్దరి పరిస్థితి ఎలా ఉందని కొందరి సహాయంతో ఎక్శైజ్ శాఖ అధికారులు ఎసిబి వద్దకు పంపుతున్నారట. వారికి బెయిల్ మంజూరైతే తమకు సమాచారం తెలిసేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. అయినా సందేహం తీరక వీరికి ఎప్పుడు బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయంటూ తమకు పరిచయమున్న డిపార్ట్ మెంట్ అధికారులను అడుగుతున్నారట. ఎసిబి అదుపులో ఉన్న ఇద్దరు వ్యాపారుల బంధువులూ సీరియస్ గా బెయిల్ మంజూరు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారంరోజులు ఎసిబి వద్దే ఉండిపోవడంతో వారు ఆడుర్థాపడి డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఆ బంధువులకు ఎక్సైజ్ సిబ్బంది బెయిల్ ఎలా తెచ్చుకోవాలో సూచనలిస్తోందట. తామెప్పుడూ సహకరిస్తామని నమ్మబలుకుతోందట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/liquor-syndicate-in-ap-24-14854.html
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.