కేటీఆర్ అమెరికా టూర్‌కు.. కేసీఆర్ ఫాంహౌజ్ మీటింగ్‌కు లింకుందా?
Publish Date:Mar 19, 2022
Advertisement
సీన్ 1: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సడెన్‌గా అమెరికా వెళ్లారు. EK 525 ఫ్లైట్‌లో దుబాయ్ మీదుగా యూఎస్ చేరుకున్న ఆయన.. 10 రోజుల పాటు పెట్టుబడులను ఆకర్షించనున్నారు. ఇదీ అధికారిక సమాచారం. కానీ, ఆఫ్ ది రికార్డ్.. వేరే మేటర్ చక్కర్లు కొడుతోంది. అత్యంత ఉన్నతస్థాయి వర్గాల్లో ఆ మేరకు ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ అమెరికా వెళ్లడం వెనుక అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. సీన్ 2: సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న కీలక మంత్రులను అర్జెంట్‌గా రమ్మన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్‌ను సైతం పిలిపించారు. ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా.. రహస్యంగా కీలక మంతనాలు జరిపారు. ఏం జరుగుతోంది? సీఎం కేసీఆర్ అంత హడావుడిగా.. అర్జెంట్‌గా.. ప్రగతిభవన్‌లో కాకుండా ఫాంహౌజ్‌లో ఎందుకు ఆ భేటీ జరిపారు. అదికూడా కేటీఆర్ అమెరికాకు వెళ్లిన కొన్నిగంటల్లోనే.. కొడుకు లేకుండానే.. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే షేకింగ్ న్యూస్. సీన్ 3: రెండు రోజుల క్రితం తెలంగాణలో KNR కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థలో ఐటీ రైడ్స్ జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద వివిధ ప్యాకేజీ పనులతో పాటు.. తెలంగాణ సర్కారు చేపట్టిన పలు పనుల్లో కీలక కాంట్రాక్టులు దక్కించుకుంది ఆ కంపెనీ. సుమారు 10వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ యజమానికి .. టీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం. KNR కన్‌స్ట్రక్షన్స్.. కేటీఆర్ బినామీ సంస్థ అని కూడా అంటున్నారు. అలాంటి కంపెనీపై కేంద్ర ఐటీ శాఖ దాడులు చేయడం మామూలు విషయమేమీ కాదు. ఈ మూడు ఘటనలు వేరు వేరుగా కాకుండా.. కలిపి చూస్తే.. అసలు సంచలన విషయం తెలుస్తుందని ఉన్నతస్థాయి వర్గాలు అంటున్నాయి. KNR కన్‌స్ట్రక్షన్స్‌పై జరిగిన ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ డాక్యుమెంట్లలో కేటీఆర్‌తో ఉన్న లింకులు బయటపడినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. కట్ చేస్తే.. KNR కన్‌స్ట్రక్షన్స్‌పై ఐటీ సోదాలు జరిగిన రెండు రోజులకే మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వారంలో తెలంగాణలో కీలక పరిణామాలు జరగనున్నాయని.. అందుకే ముందు జాగ్రత్తలో భాగంగానే కేటీఆర్ దేశం విడిచి వెళ్లారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఉదయం కేటీఆర్ విమానం ఎక్కి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్‌లో మంత్రులు, సీఎస్‌తో అత్యవసర భేటీ జరిపారు. కేటీఆర్ వెళ్లడం.. కేసీఆర్ మీటింగ్ పెట్టడం.. ఆ రెండింటికీ లింక్ ఉందని అంటున్నారు. తెలంగాణలో ఏదో జరగబోతోందని అనుమానిస్తున్నారు. ముందు ఐటీ రైడ్స్.. ఆ సమాచారంతో నెక్ట్స్ ఈడీ అటాక్స్. ఆ తర్వాత సీబీఐ. ఇదీ కేంద్రం-బీజేపీ యాక్షన్ ప్లాన్. దాదాపు అన్ని రాష్ట్రాలు, అందరు ప్రత్యర్థులపై ఇలాంటి వ్యూహమే అమలు చేస్తుంటారు. తెలంగాణ-కేసీఆర్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఇప్పటికే ఆధారాలు ఉన్నాయ్.. కేసీఆర్‌పై కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామంటూ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పక్కాగా చెబుతున్నారు. మార్చి మూడోవారంలో కేసీఆర్ పని అవుతుందని... కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌పైన, ఆయన అవినీతిపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని.. మరో బీజేపీ నేత తీన్మార్ మల్లన్న కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు. అలా జరగకపోతే తాను బీజేపీలో ఉండనంటూ బల్లగుద్ది మరీ చెప్పారంటే.. ఆ మేరకు మల్లన్న దగ్గర ఢిల్లీ వర్గాల నుంచి పక్కా సమాచారం ఉండే ఉంటుందని స్పష్టం అవుతోంది. బండి సంజయ్ హెచ్చరించినట్టు.. తీన్మార్ మల్లన్న సవాల్ చేసినట్టు.. మార్చి మూడో వారంలోనే కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌పై ఐటీ రైడ్స్ జరగడం.. కేటీఆర్ అమెరికా వెళ్లిపోవడం.. కేసీఆర్ ఫాంహౌజ్‌లో అత్యవసర సమావేశం పెట్టడం.. అన్నీ చూస్తుంటే.. తెలంగాణలో ఏదో బిగ్ మూమెంట్ జరగబోతోందని అంటున్నారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? కేసీఆర్‌ను జైల్లో పెడతారా? కేటీఆర్ అలర్ట్ అయి అమెరికా పారిపోయారా? ఫాంహౌజ్ మీటింగ్‌తో కౌంటర్ ప్లాన్ రచిస్తున్నారా? ఇలా అనేక ప్రశ్నలు.. అంతకుమించి అనుమానాలు.. also read: కేసీఆర్ నీడపై ఈడీ ఫోకస్!.. త్వరలో బిగ్ టార్గెట్!!
http://www.teluguone.com/news/content/link-between-kcr-meeting-and-ktr-tour-39-133240.html





