12 మంది బాలికలపై అత్యాచారం కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

Publish Date:Jan 6, 2022

Advertisement

వసతి గృహంలో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే అతడికి సహకరించిన వసతిగృహ నిర్వాహకుడికి కూడా  జీవిత ఖైదు విధించగా,  నేరాన్ని దాచిన ఓ మహిళకు ఆర్లెళ్ల జైలు శిక్షను విధిస్తూ.. నల్లగొండ జిల్లా ఒకటో అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది.

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీదితండాలో గుంటూరు జిల్లా నాగారానికి చెందిన భార్యాభర్తలు నున్నం శ్రీనివాసరావు, సరిత కలిసి విలేజ్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్ఓ) అనే ప్రైవేటు సంస్థను స్థాపించి బాలికల వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులోని బాలికలకు చదువు చెప్పేందుకు రమావత్ హరీశ్ నాయక్‌ను ట్యూటర్‌గా నియమించారు. ఈ క్రమంలో హరీశ్ మూడు నెలలపాటు 12 మంది బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  విషయం బయటకు చెప్పినా, ఎదురు తిరిగినా చంపేస్తానని బెదిరించాడు. నిందితుడు హరీశ్‌కు నిర్వాహకులైన శ్రీనివాస్, అతడి భార్య సహకరించారు.

3 ఏప్రిల్ 2014న బాధిత బాలిక ఒకరు తనపై జరిగిన దారుణాన్ని వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించడంతో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మొత్తం 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. దీంతో మొత్తం 12 మంది బాలిక ఫిర్యాదు మేరకు 12 కేసులు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం మొత్తం 12 చార్జ్‌షీట్లు దాఖలు చేయగా, కోర్టు విచారణలో 10 కేసుల్లో నేరం నిర్ధారణ అయింది. హరీశ్, శ్రీనివాసరావులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారిద్దరికీ జీవిత ఖైదు, రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే, బెదిరింపులకు పాల్పడినందుకు హరీశ్‌కు మరో రెండేళ్లు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్గొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నాగరాజు  తీర్పు చెప్పారు. 

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన అసెంబ్లీని కుదిపేసింది. అప్పటి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. అప్పటి మిర్యాలగూడ డీఎస్పీ(ప్రస్తుతం ఖమ్మం అదనపు ఎస్పీ) సుభాష్‌ చంద్రబోస్‌, హాలియా సీఐ(ప్రస్తుతం దేవరకొండ డీఎస్పీ) ఆనంద్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌(ప్రస్తుతం ఏఎస్సై) వెంకట్‌రెడ్డి ఈ కేసును ఛేదించి, హరీశ్‌నాయక్‌, శ్రీనివాసరావు, సరితను అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 417, 420, 506, 109, 202, 354/ఏ, 376 సెక్షన్లు, పోక్సో చట్టం కింద మొత్తం 11 కేసులు నమోదు చేశారు. అదే సంవత్సరం ఏప్రిల్‌ నెలలో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టుకు పక్కా ఆధారాలను సమర్పించారు. బాధితుల పక్షాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిరిగిరి వెంకట్‌రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న ఒకటో అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి నాగరాజు గురువారం తుది తీర్పును వెలువరించారు. ఈ తీర్పును బాధిత కుటుంబాలు, మహిళా సంఘాలు స్వాగతించాయి. ఏనమీది తండావాసులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. నిందితులకు శిక్షపడేలా చేసిన పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు నిందితులను నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. కాగా.. సరితకు ఈ కేసులో బెయిల్‌ లభించింది. 
 

By
en-us Political News

  
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.