Publish Date:Aug 12, 2022
ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా సరే రెచ్చగొట్టడం, హడావుడి చేయడం, అస్థిరతకు గురిచేయడం బీజేపీవారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం బీజేపీ నాయకత్వం అంతా తెలంగాణాపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. మునుగోడులో ఎలాగయినా గెలిచి తమ సత్తా ఏమిటన్నది కేసీఆర్ ప్రభుత్వానికి చాటాలన్న ఆతృతే ఎక్కువ ప్రదర్శిస్తున్నారు బండిసంజయ్ టీమ్. అందుకే టీఆర్ ఎస్ పార్టీ ఉపఎన్నికల్లో పాల్గొన డానికి ముందే పార్టీ వదిలేసిన వారితో రాజీనామా చేయించి యుద్ధంలోకి దిగాలని ఆయన టీఆర్ ఎస్‌కు ఓ ఛాలెంజ్ విసిరారు.
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో సంజయ్ పాద యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్‌కు నైతిక విలువలు ఉంటే ఎన్నికల్లో పోటీకి రావాలని అన్నారు.
ప్రజలను దోచుకోవడం మానుకోవాలని హితవు పలికారు. చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి హామీలన్నీ గాలికి వదిలేశారా అని ప్రశ్నిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చుచేశామన్న కేసీఆర్ దాని వల్ల తెలంగాణా రైతాంగానికి జరి గిన ప్రయోజనమేమిటో తెలియజేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదిముర్మును ఓడించేందుకు కేసీఆర్ కాంగ్రెస్‌తో చేతులు కలిపాడని ఆరోపిం చారు. కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని, కేటీఆర్ అంటే సయ్యద్ మక్బూల్ అని ఎద్దేవా చేశారు. వీఆర్‌ఏలకు మద్దతు..రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న ఆందో ళనకు సంజయ్ మద్దతు తెలిపారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నాయ కులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రామన్నపేటలో సంజయ్ ప్రసంగిస్తుండగా ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/let-jumpjilanis-resign-demands-bandi--25-141802.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.