Publish Date:Nov 12, 2024
అన్నమయ్య జిల్లాలో నిమ్మనపల్లె మండలంలో చిరుత పులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. మూడు వేర్వేరు ప్రాంతాలలో పశువులపై చిరుత పులి దాడి చేయడం ప్రజలు వణికి పోతున్నారు. పశువుల కాపర్లు మేతకు కూడా వెళ్లడం లేదు. ఇంటి ముందు కూడా పశువులను కట్టేయడం లేదు. ఏ నిమిషంలో నైనా చిరుతపులి అటాక్ చేస్తుందని భయపడుతున్నారు. నేలమళ్లేశ్వరస్వామి అటవీ ప్రాంతం, చల్లావారిపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రాంతంలోని చలిమామిడి కొండ, నిమ్మనపల్లె, వాల్మీకిపురం సరిహద్దు ప్రాంతంలో ఉన్న నూరుకుప్పల కొండలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం. గత ఆగస్టులో చిరుతపులి అటాక్ చేయడంతో మర్రిబండ వద్ద దూడ, మేకలకు గాయాలయ్యాయి.
గత నెల 31న చల్లావారిపల్లెకు చెందిన ఆదెన్న సమీపంలోని బోడికొండ వద్ద తన పొలంలో షెడ్డు వేసుకుని ఆవులను పోషిస్తున్నాడు. దూడను ఎత్తుకెళ్లి చిరుత చంపేసింది.
ఈ నెల 1న గౌనిగారిపల్లెకు చెందిన శంకర తన గొర్రెలను బోడికొండ సమీపంలో మేపుతుండగా చిరుతపులి దాడి చేసి రెండు గొర్రెలపై దాడి చేస్తుండగా గొర్రెల కాపరి అరుపులకు పరుగులు తీసింది.
ఈ నెల 8న చిరుతలగుట్ట వద్ద పారేశువారిపల్లెకు చెందిన రామయ్య మేకను పట్టుకెళ్లింది. దీంతో చిరుత సంచారాన్ని అటవీ అధికారులు కన్ఫర్మ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/leopard-tiger-migration-in-annamaya-district-25-188265.html
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..