రూ.20 లక్షల బీమా కోసం.. కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.!

Publish Date:Oct 3, 2026

Advertisement

భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు. అది కూడా ప్రమాదంగా కనిపించేలా పథకం వేసి మరీ ప్రాణాలు తీశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడటంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ప్రయాస్ పాండే, కవితా చౌదరి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. త్వరలో తమ జీవితంలోకి మరో అతిథి రాబోతున్నాడన్న ఆనందంలో ఉన్న సమయంలోనే కవితకు ఊహించని విషాదం ఎదురైంది. కవిత పేరిట ఉన్న రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులపై భర్త ప్రయాస్ కన్ను పడినట్లు పోలీసులు గుర్తించారు. 


భార్యను హత్య చేసి ఆ మొత్తాన్ని దక్కించుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం మరికొందరితో కలిసి పక్కా స్కెచ్ సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.పథకంలో భాగంగా కవితను స్కూటీపై బయటకు తీసుకెళ్లాడు. ముందుగా మాట్లాడుకున్న వ్యక్తులతో కలిసి ఓ లోడింగ్ ఆటోతో ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టించాడు. ఈ ప్రమాదంలో కవిత తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. తొలుత ఇది సాధారణ రోడ్డు ప్రమాదమేనని అందరూ భావించారు. అయితే.. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అనుమానాలు మొదలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం కాదని తేలింది. ఎవరో కావాలనే ఈ ప్రమాదాన్ని సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భర్త ప్రయాస్ పాండేపై అనుమానం బలపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 


రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్యకు పథకం వేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.అయితే ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం.. కవిత గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే.. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా డబ్బు కోసం ప్రాణాలు తీశాడన్న విషయం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మిన భర్తే.. తన జీవితాన్ని ముగించినట్లు తెలుసుకున్న కవిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. డబ్బు కోసం ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఒకప్పుడు ప్రేమతో మొదలైన ఆ బంధం.. చివరకు రూ.20 లక్షల కోసం ఓ ప్రాణాన్ని బలిగొంది. నమ్మిన మనిషే నయవంచకుడిగా మారితే.. ఆ గాయం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

 

 

 

[ Insurance Money Murder, Husband Kills Wife, Madhya Pradesh Crime, Jabalpur Crime, Pregnant Woman Murder, Insurance Murder  Case, Husband Wife Crime, Love Marriage Murder, Madhya Pradesh Murder, Jabalpur Murder Case ]
 

By
en-us Political News

  
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.