తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనల్లో భక్తులు
Publish Date:Aug 5, 2025
Advertisement
తిరుమల నడకమార్గం, తిరుమలలో చిరుతల సంచారం భక్తులను బెంబేలెత్తిస్తోంది. భక్తుల భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామంటూ అధికారలు భరోసా ఇస్తున్నప్పటికీ చిరుతల సంచారం కారణంగా భక్తుల ఆందోళన తగ్గడం లేదు. ఇటీవల తిరుపతి జూపార్క్ రోడ్డులో, శ్రీవారి మెట్టుమార్గంలో చిరుతల సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో చిరుత సంచారం భక్తులనే కాకుండా స్థానికులను సైతం తీశ్ర భయాందోళనలకు గురి చేస్తున్నది. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. అప్రమత్తమైన అటవీ శాఖ, టీటీడీ అధికారులు భయాందోళనలు వద్దని భక్తులు, స్థానికులకు భరోసా ఇచ్చారు. చిరుతను అటవీ ప్రాంతంలోనికి మళ్లిస్తామని చెప్పారు. రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు.
http://www.teluguone.com/news/content/leopard-roaming-in-tirumala-39-203514.html





