అవాస్తవ వార్త ప్రసారం చేసిన మీడియా సంస్థకు బిఆర్ఎస్ నోటీసులు 

Publish Date:Aug 19, 2024

Advertisement

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని ఫేక్‌ వార్తలు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్టీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌ సంస్థకు, రవి ప్రకాశ్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ లీగల్‌ నోటీసులు పంపింది.

ఐదు రోజుల్లోగా నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని, విలీనం వార్తలను ఆర్టీవీ నెట్‌ వర్క్‌ వెంటనే తొలిగించాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నది. లేదంటే లీగల్‌ చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ తన నోటీసుల్లో పేర్కొన్నది. గత పదేళ్ల నుంచి బీజేపీతో బీఆర్‌ఎస్‌ విభేదిస్తున్న విషయాన్ని నోటీసులో పేర్కొన్నది. కానీ ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారంతో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ప్రభావితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అసత్య ప్రచారంతో బీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని తెలిపింది. బీఆర్‌ఎస్‌పై ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారాలకు సంబంధించిన యూట్యూబ్‌ లింక్‌లను నోటీసుల్లో పేర్కొన్నది. 


ఆర్టీవీ ప్రసారం చేసిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్, బిజెపిలో విలీనం కానుందన్న వార్త నిజమేనన్నారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ కు గవర్నర్ పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కు  కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు  చేసిన ప్రకటనతో బిఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఒక వేళ విలీనమైతే బిఆర్ఎస్ ఆస్తులు బిజెపికి ఇచ్చేయాల్సి ఉంటుందని కథనాలు వెలువడ్డాయి. అధికారమే పరమావధిగా పని చేస్తున్న కారు పార్టీకి ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా పట్ల ఎలాంటి గౌరవం లేదని పలుమార్లు నిరూపించుకున్నారు. అలాగే కెసీఆర్ కు న్యాయవ్యవస్థ పట్ల కూడా నమ్మకం లేదు. సుప్రీం తీర్పులను డస్ట్ బిన్ లో పడేసి పాలన చేసిన బిఆర్ఎస్ ను ప్రజలు అథోపాతాళానికి తొక్కేశారు. అయినప్పటికీ కెసీఆర్ తన అహంకారాన్ని వీడటం లేదు. 

By
en-us Political News

  
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.