కేటీఆర్ వర్సెస్ హరీష్.. బీఆర్ఎస్ దారెటు?

Publish Date:Aug 19, 2024

Advertisement

అధికారం కోల్పోయినప్పటి నుంచీ బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఆ పార్టీ అధినేత కాడె వదిలేసినట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా రెండవ శ్రేణి నాయకత్వం, క్యాడర్ మాజీ మంత్రి హరీష్ రావు  వెనుక ర్యాలీ అవుతుంటే.. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీలో తన స్థానాన్ని, ఆధిపత్యాన్నీ, నంబర్ 2 స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు.

దీంతో బీఆర్ఎస్ హరీష్, కేటీఆర్  వర్గాలుగా నిలువునా చీలిపోనుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చాపకింద నీరుగా  బీఆర్ఎస్ లో అంతర్గత పోరు షురూ అయ్యి విస్తరిస్తోందని  గత కొద్ది రోజులుగా  పార్టీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఉదహరిస్తూ  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మాజీ మంత్రి హరీష్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా.. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుకు పెద్దగా మద్దతు లభించడం లేదు. సిద్దిపేటలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లూ వెలిసినా, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.  

రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి బీఆర్ఎస్ నుంచి ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపలేదు. మరీ ముఖ్యంగా కేటీఆర్ అసలు స్పందించ లేదు.  దీంతో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావే స్వయంగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు బీఆర్ఎస్ లో వర్గపోరు ఆరంభమైందనీ, ఇది కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా రూపాంతరం చెందడానికి పెద్దగా సమయం తీసుకునే అవకాశాలు లేవనీ అంటున్నారు.  మరో వైపు కాంగ్రెస్ కూడా కేటీఆర్ ను పెద్దగా పట్టించుకోకుండా హరీష్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడాన్ని చూస్తుంటే.. పార్టీ బలం కేటీఆర్ కాదు, హరీష్ రావే అని అధికార పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో గతంలో అంటే పార్టీ శాసనసభా పక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే విషయంలో బీఆర్ఎస్ విఫలం అయి4న సంగతిని గుర్తు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు హరీష్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు.  అన్నిటికీ మించి బీఆర్ఎస్ లో కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా హరీష్ ను ఫోకస్ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హరీష్ రావుపై సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతల విమర్శలు, వ్యాఖ్యలపై కేటీఆర్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు.  

By
en-us Political News

  
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.