టీచర్లపై లీకు వీరుల ముద్ర.. ఆందోళన బాట పట్టిన ఫలితమేనా?

Publish Date:May 6, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ వైఫల్యాల ఖాతాలోకి తాజాగా టెన్త్ పరీక్షల నిర్వహణ కూడా చేరింది. ప్రభుత్వాన్ని నడపడంలో అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి నెపం విపక్షం మీదకు నెట్టివేయడానికి జగన్ సర్కార్ చూపుతున్న ఉత్సాహం   వైఫల్యాలను అధిగమించి పాలనను గాడిలో పెట్టే విషయంలో మాత్రం చూపించడం లేదు. 

తనను వ్యతిరేకించిన వారిని, తన నిర్ణయాలను ప్రశ్నించిన వారినీ వేధింపులకు గురి చేయడానికే జగన్ సర్కార్ తనకున్న అధికారాలన్నిటినీ వినియోగిస్తున్నదన్న విమర్శలకు తాజాగా టెన్త్ పేపర్ల లీకు విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలు, తీసుకుంటున్న చర్యలు బలం చూకూరుస్తున్నాయి. 

టెన్త్ పేపర్ల లీకు ఉపాధ్యాయుల పనేనని ప్రభుత్వం ఎలాంటి విచారణా జరపకుండానే నిర్ధారణకు వచ్చేసింది. వారి చేత లీకులు చేయిస్తున్నదెవరో కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ధారణలూ అవసరం లేకుండానే ప్రకటించేసింది. 

పేపర్ల లీకు పూర్తిగా టీచర్ల పనేనంటూ ఇప్పటి వరకూ దాదాపు 60 మంది టీచర్లపై చర్యలు తీసుకుంది. వాట్సాప్ గ్రూపుల ద్వారా లీకులకు పాల్పడుతున్నది టీచర్లేనని, వారి వెనుక ఉన్నది చైతన్య, నారాయణ విద్యా సంస్థలేనని ప్రభుత్వం చెబుతోంది. 

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అసలు టెన్త్ పేపర్లే లీక్ అవ్వలేదని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఒక వైపు సంబంధిత శాఖ మంత్రి పేపర్ల లీక్ అవాస్తవమని చెబుతుంటే.. సర్కార్ మాత్రం పేపర్ల లీక్ కు బాధ్యులంటూ టీచర్లపై వేటు వేస్తోంది. కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ఈ గందరగోళం ప్రభుత్వంలో ఉందా? లేదా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశ పూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందా అన్న సందేహాలు ప్రజలలో వ్యక్తమౌతున్నాయి.

అయితే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనీ, ఉద్దేశ పూర్వకంగానే లీకు వీరులుగా తమపై ముద్ర వేసి చర్యలు తీసుకుని ప్రజలలో పలుచన చేయడానికి ప్రయత్నిస్తున్నదని టీచర్లు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్నందునే ప్రభుత్వం టీచర్లను వేధించేందుకే పేపర్ల లీకును  వాడుకుంటోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. లీకు వీరులంటూ ప్రభుత్వం అరెస్టు చేసిన టీచర్లంతా కూడా ఆందోళనల్లో చురుకుగా వ్యవహరిస్తున్న వారే కావడం ఇక్కడ ప్రత్యేకించి గమనార్హం.

ఆ విషయం పక్కన పెడితే.. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకూ తావు లేకుండా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతా నిర్వహణలో పూర్తిగా విఫలమైన సర్కార్..లీకుల వెనుక కుట్ర అంటూ ఆరోపణలు చేయడం ఆడ లేక మద్దెలు ఓడు అనడం తప్ప మరొకటి కాదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో ముడి పడి ఉన్న పరీక్షల నిర్వహణలో జగన్ సర్కార్ వైఫల్యం సహించరానిదని అంటున్నారు. విద్యా శాఖ మంత్రిగా బాధ్యత తీసుకోలసిన బొత్స సత్యనారాయణ బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని అంటున్నారు. 

అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా జగన్  రాష్ట్రంలో జరిగే సమస్త తప్పులకూ విపక్షమే కారణమని చెప్పడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అవకతకలకు జగరకుండా, తప్పులు జరగకుండా, ఒక వేళ అలా జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుని వాటిని సరిదిద్దాల్సిన అధికారంలో ఉన్న జగన్ నెపం విపక్షం మీద తోసేసీ తానేం చేయలేనని చేతులెత్తేయడం వింతగా ఉందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. నేరం చేసిన వారు ఎవరు అన్న దాని కంటే వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్నదే ముఖ్యం కాగా, జగన్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. విపక్షం మీద ఆరోపణలు చేయడం తప్ప.. ఆ ఆరోపణలపై నిలబడటం కానీ, చర్యలు తీసుకోవడం కానీ ఇప్పటి వరకూ జరిగిన దాఖలాలు కనబడవు.  అధికారంలో ఉండి చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా ఎంత సేపూ ఎదుటి వారిపై నిందలు మోపి పబ్బం గడిచిపోయిందనుకునే రీతిలో జగన్ తీరు ఉంది. అనుభవ రాహిత్యం, అవగాహనా రాహిత్యానికి పరాకాష్టగా, అధికార ఉన్నాదానికి కేరాఫ్ అడ్రస్ గా జగన్ పాలన ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్ల రాజకీయంగా జగన్ కు నష్టం జరుగుతుందని వివ్లేషణలు వస్తున్నా.. ఆ నష్టం కన్నా ముందు సమాజానికీ, రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మాటేమిటి?

By
en-us Political News

  
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.