అలీకి రాజ్య‌స‌భ కాద‌ట‌..అద‌ట‌! పోసానికీ ఉంద‌ట‌!.. సినిమా చూపిస్తున్న జగనన్న‌..

Publish Date:Feb 16, 2022

Advertisement

గుర్తుండే ఉంటుంది. ఇంచుమించుగా ఒక నెల, నెలన్నర రోజుల క్రితం మెగా స్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి విందుకు రమ్మని ఆహ్వానం అందింది. మెగాస్టార్, మహదానందంగా వెళ్ళారు. ముఖ్యమంత్రితో  కలిసి కూర్చుని లంచ్ చేశారు. అయితే, చిరంజీవి వెళ్ళింది కేవలం లంచ్ చేసేందుకే కాదు, సినిమా పరిశ్రమ సమస్యలు, ముఖ్యంగా సినిమా టికెట్ల వివాదం విషయం చర్చిందేందుకే ముఖ్యమంత్రి ఆయన్ని పిలిచారు, అందుకోసమే ఆయన వెళ్ళారు. అయితే, లోపల ఆ ఇద్దరు ఏమి చర్చించుకున్నారో, ఏమో కానీ, ఆయన బయటకు వచ్చేసరికి, సినిమా టికెట్ గోల పక్కకు పోయి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇచ్చారని,ఇస్తారని ప్రచారం జరిగి పోయింది. చిరంజీవి కొంత బద్నాం అయ్యారు. పబ్లిక్’లో ఆయన ఇమేజ్’ ‘ఛీ’ స్థాయికి చేరి పోయింది. ఆ తర్వాత చిరంజీవి, ముఖ్యమంత్రి అలాంటి ఆఫర్ ఏదీ ఇవ్వలేదని, ఇచ్చినా తాను పుచ్చుకోనని అన్నారు. 

ఇక అక్కడి నుంచి, ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీ, సినిమా ఇండస్ట్రీ సంబందాల విషయంలో ఏదో ‘టాక్ ట్రాక్’ నడుస్తూనే ఉంది. సంచలనం అవుతూనే వుంది. సర్కా ర్’కు ఇండస్ట్రీలో ఒక వర్గం జీ హుజూర్ అయిపోయిందనే మాట వినిపిస్తూనే వుంది. చివరకు ప్రతిపక్ష నేత నేత చంద్రబాబు నాయుడు కూడా, సర్కార్ సినిమా సంబంధాలపై స్పదించారు. మరీ ఇంతలా దిగజార వలసిన అవసరం ఏముందని, ‘స్టార్స్’కు చురకలు అంటించారు. ఇంత అహంకారం ఎందుకని ముఖ్యమంత్రికి వాతలు పెట్టారు. 

అదలా ఉంటే, తాజాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కమెడియన్ అలీని తెర మీదకు తెచ్చారు. చిరంజీవిని పిలిచినట్లే ఆలీనీ ‘ఏకాంత’ చర్చలకు ఆహ్వానించారు. అలీలోనూ రాజ్యసభ ఆశలు చిగురించాయి. నిజానికి ఆలీ చాలా కాలంగా రాజకీయాలలో, అంటే వైసీపీలో  ఉన్నారు . గత అసెంబ్లీ ఎన్నికల్లోనే గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అన్నారు. అయన పోటీ చేయలేదు కానీ, వైసీపీలో కొనసాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్’లో నిన్న మొన్నటిదాకా ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు గ్యారెంటీ అన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పడు సీన్’ మారిందని అంటున్నారు. 

కమేడియన్’కు అంత పెద్ద పోస్టు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, ఇప్పుడు ఏపీ వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ పోస్టుతో సరి పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలీతో పాటు, మరో కమెడియన్ పోసాని కృష్ణ‌ముర‌ళికి సైతం జగన్ ఏదో ఒక పోస్టు ఇస్తారని అంటున్నారు. నిజానికి అలీ కంటే.. జ‌గ‌న్’ ను గట్టిగా సమర్ధించింది, ఘనంగా నష్టపోయింది, పోసానే అంటారు. జగన్ కోసం పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయి విమర్శలు చేశారు, ఫలితంగా ఆయనకు ఆఫర్లు రావడంలేదని ఆయనే చెప్పారు. ఈ పరిస్థితిలో  ఈ ఇద్దరు కమెడియన్స్’ కు జగన్ కామెడీ పాత్రలే ఇస్తారో ఇంకే పాత్రలు ఇస్తారో చూడవలసి వుందని అంటున్నారు. మొత్తానికి సినిమా వాళ్ళకు జగన్ రెడ్డి సినిమా చూపిస్తున్నారు. అయితే సినిమా అభిమానులు మాత్రం సినీ హీరోల పరిస్థితి, ‘ఇంత బతుకు బతికి . ..ఇంటి వెనకాల ఏడ్చినట్లు’ ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.