భారాస కోసం భూ కుంభకోణం

Publish Date:Jan 17, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పై బీజేపీ చేయని ఆరోపణ లేదు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు, బీజేపీ రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం అవినీతిలో కురుకు పోయిందని ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కుమార్తె కవిత సహా  అధికార బీఆర్ఎస్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక మందిపై వచ్చిన ఆరోపణలపై   సిబిఐ, ఈడీ దాడులు, విచారణలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని పలు సందర్భాలలో ప్రకటించారు. చంచలగూడ జైల్లో ఆయన కోసం గది సిద్డంవుతోందని కూడా బండి సంజయ్ అనేక సందర్భాలలో పేర్కొన్నారు.

మరో వంక ముఖ్యమంత్రి కేసీఆర్, దమ్ముందా? టచ్ చేసి చూస్తావా? అంటూ సవాళ్ళు విసిరారు. అయితే  పరస్పర  ఆరోపణలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు హోరెత్తడమే కానీ, చివరకు ఏమి జరిగింది అంటే, ఏమీ లేదు, సున్నకు సున్నా- హళ్లికి హళ్లి. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి ఆరోపణలు చేస్తోంది, ఒక్క బీజేపీ మాత్రమే కాదు, కేసీఆర్ తో విభేదించిన కల్వకుట్ల కుటుంబ సభ్యులు సహా  కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకుఅలు అందరూ, కేసీఆర్ ప్రభుత్వం పైన, కేసీఆర్ కుటుబం అవినీతి పైనా పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

గడచిన ఎనిమిదేళ్ళలో వందలు కాదు, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, వందల వేల ఎకరాల భూమి అధికార పార్టీ నేతల కబ్జాకు గురైందని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. చివరకు, నిన్నగాక మొన్నపుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ప్రజాపార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ సహా అనేక మంది నాయకులు సామాజిక కార్యకర్తలు నేరుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసి కేసీఆర్ కుటుంబ అవినీతికి సంబధించి విచారణ జరిపించాలని కోరుతూ, వినతి పత్రాలు అందజేశారు. ఆరోపణలకు  ఆధారాలను కూడా కేంద్రానికి అందజేశామని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సందర్భాలలో పేర్కొనారు. అయినా కేంద్ర ప్రభుత్వం కదిలింది లేదు చర్యలు తీసుకున్నదీ లేదు.

అయినా కొత్త కొత్త ఆరోపణలు  పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో  సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారని ఆరోపించారు. దాదాపు 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్  తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు.  మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై   సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్..  తోట చంద్రశేఖర్ భూములపై  ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు.  

తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని  విమర్శించారు. మియాపూర్  భూములతో లాభ పడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు.అయితే గతంలో చేసిన ఆరోపణలకే దిక్కు లేదు, ఇప్పడు వచ్చిన ఆరోపణలకు విలువ ఉంటుందా? అనుమానమే ..

By
en-us Political News

  
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.