అలీ నోట పోటీ మాట!

Publish Date:Jan 17, 2023

Advertisement

పేకాట పేకాటే..తమ్ముడు తమ్మడే అన్నది సామెత... ఇప్పుడు కమేడియన్ కం పొలిటీషియన్ అలీ ఆ సామెతనే కొద్దిగా మార్చి.. స్నేహం స్నేహమే.. రాజకీయం రాజకీయమే అంటున్నారు.  తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఫ్రెండ్ అన్న పదానికి పవన్ కల్యాణ్, అలీ పర్యాయపదంగా ఉంటారు. అయితే అది ఇప్పుడు కాదు.. అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోక ముందు. ఆ తరువాత ఇరువురి మధ్యా  అంత సఖ్యత లేదని సినీ రాజకీయ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది.

ఒక సందర్భంగా అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంపై పవన్  కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను అలీ గట్టిగానే కాదు ఘాటుగా కూడా తిప్పి కొట్టారు. ఆ తరువాత ఇరువురూ కూడా ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉండి పోయారు. ఇటీవల అలీ కుమార్తె వివాహం సందర్భంగా అలీ ఆహ్వానం పంపినా పవన్ కల్యాణ్ వెళ్లలేదు.. ఇరువురి మధ్యా స్నేహం కాదు.. కనీసం పలకరింపులు కూడా లేవనడానికి  ఇదే నిదర్శనం అంటూ వచ్చిన వ్యాఖ్యలకు అలీ.. తన అలీతో సరదాగా ముగింపు సందర్భంగా యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో బదులిచ్చారు. విమానం మిస్ కావడం వల్లనే పవన్ కల్యాణ్ హాజరు కాలేదని అలీ వివరణ ఇచ్చారు. రాజకీయంగా వేరు అయినా ఇద్దరం మిత్రులమే అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు తాజాగా అదే అలీ..వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచే తాను ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే అందకు కండీషన్స్ అప్లై అని కూడా  అన్నాడు. పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికలలో పవన్ తో ఢీ కొట్టేందుకు రెడీ అని చెప్పాడు. అప్పడు కూడా రాజకీయంగా వేరైనా మేం ఇద్దరమూ స్నేహితులమే అంటూ ముక్తాయించారు.  అయినా రాజకీయాలలో స్థాయితో సంబంధం లేకుండా సవాళ్లు చేయడం సహజమే.. ఇటీవల కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేయడానికి తాను రెడీ, మరి చంద్రబాబు పుంగనూరులో పోటీకి సిద్ధమా అంటూ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు.  ఇలాంటి సవాళ్లు రాజకీయాలలో మామూలే. ఆ సవాళ్ల వెనుక పార్టీ అధినేతను మొప్పించే వ్యూహం ఉంటుందే తప్ప నిజంగా ఎవరూ కొండను ఢీ కొనాలని చూడరు. పెద్ది రెడ్డి సవాల్ అయినా, అలీ సవాల్ అయినా ఈ కోవలోకే వస్తుంది.  

అయితే ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నా పెద్దగా రాజకీయ ప్రసంగాల జోలికి పోని అలీ ఈ సారి పోటీ చేసేందుకు జగన్ టికెట్టిస్తారన్న ఆశతోనో మరెందుకో.. పొలిటికల్ ప్రసంగాలకు దిగారు. రాష్ట్రంలో వైసీపీ 175 అవుటాఫ్ 175 స్థానాలను గెలచుకుకోవడం ఖాయమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాకుండా జనసేన, టీడీపీ మధ్య పొత్తు వార్తలను లైట్ తీసుకున్నారు. అవి రెండూ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా పెద్ద ఫరక్ పడదని అలీ చెప్పారు.  

ఏదో సినిమాలో అలీ హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి కండలు తిరిగిన వీరుడిలా కనిపించడానికి బెలూన్లను ధరిస్తాడు.. ఇప్పుడు రాజకీయాలలో కూడా సరిగ్గా అలాగే పవన్ కు దీటుగా కనిపించడానికి నేల విడిచి సాము చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఆయన వైసీపీలో ఉన్న ఇంత వరకూ  రాజకీయంగా విమర్శల జోలికి పోలేదు. కానీ ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు.. ఒక సలహాదారు పదవి అలీని మార్చేసింది. వచ్చే ఎన్నికలలో మరింత కీలక పాత్ర దొరుకుతుందన్న ఆశతో విమర్శల బాట పట్టారు.

By
en-us Political News

  
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.